Share News

Somireddy: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది..

ABN , Publish Date - Dec 19 , 2023 | 01:07 PM

నెల్లూరు: టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ ప్రభుత్వంపై కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని, గతంలో బీహార్ అరాచకాల పరిస్థితులు ఇప్పుడు ఏపీలో నెలకొన్నాయని తీవ్రస్థాయిలో విమర్శించారు.

Somireddy: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది..

నెల్లూరు: టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ ప్రభుత్వంపై కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని, గతంలో బీహార్ అరాచకాల పరిస్థితులు ఇప్పుడు ఏపీలో నెలకొన్నాయని తీవ్రస్థాయిలో విమర్శించారు. ‘‘ఏపీలో టీడీపీ అధికారంలోకి రాబోతుంది, ఖచ్చితంగా మేము అవినీతిపై చర్యలు తీసుకుంటాం. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి మైనింగ్ మాఫియా చేస్తున్నారు. నేను నాలుగు రోజులుగా ప్రశాంతంగా దీక్ష చేస్తుంటే, పోలీసులు దోపిడీ దొంగల్లా నన్ను తీసుకెళ్లడం దారుణం. హిజ్రాలకు డబ్బులు ఇచ్చి నా మీద దాడి చేయించాలని చూశారు. మీరని తెలియక వచ్చామని నన్ను దీవించి వెళ్ళారు. దేశంలోనే అతిపెద్ద కుంభకోణాల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సిలికా, తెల్లరాయి కుంభకోణాలు నిలిచాయి. మంత్రి నియోజక వర్గంలో వరదాపురం వద్ద రుస్థం మైన్‌లో అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. భారీ యంత్రాలు, పేలుడు పదార్థాలు రెడ్ హ్యాండెడ్‌గా పట్టించాం. పేలుడు పదార్థాలు, డ్రిల్లింగ్ మిషన్‌ల ఆధారాలు చూపినా అధికారులు పట్టించుకోడం లేదు. మేము మైన్ దగ్గర చూపించిన పేలుడు పదార్థాలను, నేనే అక్కడ పెట్టానని తప్పుడు కేసులు పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరుగుతుంటే.. ఈ జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఏమి చేస్తున్నారు?.. ప్రతి నెలా మొదటి వారంలో సీఎం జగన్, మరికొంత మందికి ఇక్కడ సామంతులు ద్వారా భారీగా డబ్బులు వెళుతున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భారీగా ఖనిజ సంపదని దోచేస్తున్న మాఫియాను అధికారులు అడ్డుకోవడం లేదు’’ అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Updated Date - Dec 19 , 2023 | 01:07 PM