Somireddy: హైకోర్టు తీర్పు జగన్ ప్రభుత్వానికి చెంప దెబ్బ..

ABN , First Publish Date - 2023-05-12T14:09:06+05:30 IST

అమరావతి: ఏపీ హైకోర్టు (AP High Court) తీర్పు జగన్ ప్రభుత్వానికి (Jagan Govt.) చెంప దెబ్బఅని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.

Somireddy: హైకోర్టు తీర్పు జగన్ ప్రభుత్వానికి చెంప దెబ్బ..

అమరావతి: ఏపీ హైకోర్టు (AP High Court) తీర్పు జగన్ ప్రభుత్వానికి (Jagan Govt.) చెంప దెబ్బ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) అన్నారు. జీవో నెం.1 (GO No.1)పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన ఆయన శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం తెచ్చిన నిరంకుశమైన జీవో నెం 1 ను హైకోర్టు కొట్టివేయడం శుభపరిణామమన్నారు. రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, ప్రజలు రోడ్లపై నిరసన, పాదయాత్రలు, సభలు పెట్టకూడదని.. దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా నిరంకుశపాలన ఏపీలో సాగుతోందని.. అందుకు నిదర్శనమే జగన్ రెడ్డి తెచ్చిన జీవో నెంబర్ 1 అని అన్నారు. ఈ నిరంకుశ జీవోను కొట్టివేస్తూ హైకోర్టు సంచలనాత్మక తీర్పు ఇచ్చిందని వ్యాఖ్యానించారు.

ప్రజలు, ప్రతిపక్షాలు, ఉద్యోగ, కార్మిక సంఘాలు నిరసన తెలపకూడదు కానీ.. సీఎం జగన్ రెడ్డి రోడ్డుపైకి వస్తే బ్యారికేడ్లు కడతారని.. పచ్చని చెట్లు నరికేస్తారని తీవ్ర స్థాయిలో సోమిరెడ్డి మండిపడ్డారు. నెల్లూరు జిల్లా, కావలికి సీఎం జగన్ వస్తున్నారని.. మూడు రోజులుగా అధికారులు ఓవరాక్షన్ చేస్తున్నారని, సభాస్థలికి కనెక్ట్ అయ్యే మూడు రోడ్లలో చిరు వ్యాపారుల దుకాణాలను తొలగించారన్నారు. ట్రాఫిక్ కూడా ఆపేశారని, సెల్ ఫోన్లు పనిచేయకుండా టవర్లను నిలిపివేశారన్నారు.

సీఎం జగన్ మోహన్ రెడ్డికి ప్రజల్లోకి వచ్చే దమ్ము లేకుండా పోయిందని, ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని సోమిరెడ్డి విమర్శించారు. జీవో నెం 1ని కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు సీఎం నిరంకుశ విధానాలకు చెంపదెబ్బ లాంటిదన్నారు. పచ్చి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ఇప్పటికైనా పశ్చాత్తాపపడి పాలన పద్ధతిగా సాగించాలని సోమిరెడ్డి సూచించారు.

Updated Date - 2023-05-12T14:09:06+05:30 IST