Share News

Nellore: సోమిరెడ్డి నిరవధిక నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు

ABN , Publish Date - Dec 19 , 2023 | 08:05 AM

నెల్లూరు: జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. నాలుగు రోజులుగా వరదాపురంలో అక్రమ క్వారీ తవ్వకాల ప్రాంతంలో సోమిరెడ్డి దీక్ష చేస్తున్నారు.

Nellore: సోమిరెడ్డి నిరవధిక నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు

నెల్లూరు: జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. నాలుగు రోజులుగా వరదాపురంలో అక్రమ క్వారీ తవ్వకాల ప్రాంతంలో సోమిరెడ్డి దీక్ష చేస్తున్నారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో సోమిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఆపై వాహానాల్లో ఆయనను ఇంటికి తరలించారు. శాంతియుతంగా దీక్ష చేస్తున్న ప్రాంతానికి సుమారు 200 మంది హిజ్రాలు, వైసీపీ గూండాలను అక్రమార్కులు పంపారు. క్వారీలో ఉన్న భారీ యంత్రాలు, వాహానాలను బయటకి పంపేయత్నం చేశారు. అయితే టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వివాదాలు జరిగి.. ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను బయటకి పంపారు. వైసీపీ గూండాలకు పోలీసులు సపోర్డు చేశారు. జగన్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సోమిరెడ్డి శిబిరంపైకి హిజ్రాల దండు

అక్రమాలను, అన్యాయాలను ప్రశ్నించే ప్రతిపక్షాలపై అక్ర మ కేసులు బనాయించడం, ఆస్తులు ధ్వంసం చే యడం, అసత్య అభియోగాలతో అట్రాసిటీ కేసు లు పెట్టడం.. నాలుగున్నరేళ్లుగా వైసీపీ నేతలు అనుసరిస్తున్న విధానం. తాజాగా, మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీ నేతలు కొత్త ట్రెండ్‌ తెచ్చారు. అక్రమాలను ప్రశ్నించే వారిపై హిజ్రాలను ఉసిగొలిపి అవమానకర రీతిలో విపక్ష నేతలను శారీరకంగా, మానసికంగా హింసించే కొత్త విధానాన్ని అమలు పరిచారు. పొదలకూరు మండలంలో రుస్తుం క్వారీ నుంచి మంత్రి కాకా ణి అండదండలతో ఆయన అనుచరులు రూ.కోట్ల తెల్లరాయిని తరలిస్తున్నారని ఆరోపిస్తూ టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ‘సత్యాగ్రదీక్ష’ పేరుతో 16 నుంచి ఆందోళనకు దిగారు. మూడు రోజులుగా క్వారీ వద్దే దీక్షకు చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన మాజీ మంత్రి మూడు రోజులుగా రేయింబవళ్లు క్వారీ వద్ద నిరసన వ్యక్తం చేస్తుంటే, కోట్లాది రూపాయల ప్రజా సంపదను అక్రమంగా కొల్లగొట్టుకొని పోతున్నారని ఆరోపిస్తుంటే.. ఈ విషయం మీడియాలో ప్రధా న వార్తాంశాలుగా చక్కర్లు కొడుతున్నా.. మూడు రోజులుగా ఒక్క అధికారి కూడా ఆ క్వారీ వైపు కన్నెత్తి చూడలేదు. ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఉందా లేదా అని తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. అధికారుల ప్రతినిధులుగా ప్రభుత్వ శాఖల గుమాస్తాలు కూడా అటు వైపు తిరిగి చూడలేదు. కానీ, ఈ విషయంతో ఏమాత్రం సం బంధం లేని హిజ్రాలు మాత్రం సోమవారం ఒక హైటెక్‌ బస్సు వేసుకొని మరీ క్వారీ వద్దకు వచ్చారు. ఒకరిద్దరు కాదు.. సుమారు 80 మంది వరకు హిజ్రాలు క్వారీ వద్దకు చేరుకున్నారు. క్వారీకి కొంత దూరంలోనే బస్సు దిగి వారి శైలిలో తిట్టిపోసుకొంటూ దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. అయితే దీక్ష శిబిరంలో సోమిరెడ్డి పక్కన 200 మందికిపైగా టీడీపీ శ్రేణులు ఉండటంతో ఎలాంటి దురదృష్టకర సంఘటన జరగలేదని ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు.

దిష్టి తీయడానికి 80 మంది వస్తారా!?

క్వారీ వద్దకు చేరుకున్న హిజ్రాల సమూహాన్ని అక్కడున్న టీడీపీ నేతలు ప్రశ్నించగా.. తాము క్వారీకి దిష్టి తీయడానికి వచ్చామన్నారు. క్వారీ మొత్తం కలియతిరిగి వెనుక్కు వచ్చి ఆగారు. రాత్రి 7 గంటల వరకు సమీపంలోనే ఉన్నట్లు స్థానికుల సమాచారం. ఎవరో ఒకరి ప్రమే యం లేకుండా హిజ్రాలు భారీ సంఖ్యలో హైటెక్‌ బస్సును అద్దెకు తీసుకొని మరీ క్వారీ వద్దకు వస్తారా!? అనేది పెద్ద ప్రశ్న. కచ్చితంగా హిజ్రాలను అక్కడికి తరలించడం వెనుక క్వారీలో అక్రమ మైనింగ్‌ చేస్తున్న వైసీపీ నాయకు లు ఉన్నారంటున్నారు. హిజ్రాల చేత అల్లర్లు చేయించి, టీడీపీ నేతలు వెళ్లిపోయేలా చేసి, రాత్రికి రాత్రి క్వారీలో సిద్ధంగా ఉన్న 12 లారీల తెల్లరాయిని దాటించాలనేది అక్రమార్కుల ఎత్తుగడగా టీడీపీ వర్గాలు అంటున్నాయి.

Updated Date - Dec 19 , 2023 | 09:19 AM