Minister Kakani: ఫోన్ ట్రాప్ కాదు, చంద్రబాబు మాన్ ట్రాప్..

ABN , First Publish Date - 2023-02-09T15:50:45+05:30 IST

నెల్లూరు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి వెళ్లేందుకు జగన్ ప్రభుత్వంపై అభాండాలు వేశారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.

Minister Kakani: ఫోన్ ట్రాప్ కాదు, చంద్రబాబు మాన్ ట్రాప్..

నెల్లూరు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy) టీడీపీ (TDP)లోకి వెళ్లేందుకు జగన్ ప్రభుత్వం (Jagan Govt.)పై అభాండాలు వేశారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Minister Kakani Govardhan Reddy) అన్నారు. గురువారం మంత్రి ఇక్కడ మీడియాతో మాట్లా

డుతూ ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) ఆరోపణ ఓ పెద్ద ట్రాష్ (Trash) అని.. జరిగింది ఫోన్ ట్రాప్ కాదని.. చంద్రబాబు మాన్ ట్రాప్ (Chandrababu Man Trap) అని వ్యాఖ్యానించారు. కోటంరెడ్డి ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తే మీడియాకు వాస్తవం వెల్లడించారని చెప్పారు.

ట్యాపింగ్ ఆరోపణ నిజమైతే కోటంరెడ్డి కోర్టుకు ఎందుకు వెళ్ళలేదని మంత్రి కాకాణి ప్రశ్నించారు. పెంచిపోషించిన పార్టీకే ద్రోహం చేశారని, కోటంరెడ్డికి ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయని అన్నారు. రూరల్ నియోజక వర్గ ముఖ్యనేతలంతా పార్టీలోనే కొనసాగుతున్నారని, వాపును చూసి కోటంరెడ్డి బలుపని భ్రమపడుతున్నారని మంత్రి కాకాణి దుయ్యబట్టారు.

మరోవైపు ఎమ్మెల్యే కోటంరెడ్డిపై ఆదాల ప్రభాకర్ రెడ్డి (Adala Prabhakar Reddy) హాట్ కామెంట్స్ ( Hot Comments) చేశారు. మీడియా సమావేశాలు పెట్టి అబద్దాలు మాట్లాడటం చాలా తప్పని అన్నారు. కోటంరెడ్డి గుట్టు త్వరలోనే ప్రజల దగ్గర విప్పుతామన్నారు. ఎంతమందిని ఏ విధంగా వేధించారో ప్రజలకి తెలుసన్నారు. తానే రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానన్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే కంటే తనకు 5 వేల ఓట్లు రూరల్‌లో ఎక్కువగా వచ్చాయని ఆదాల పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్, హోటల్స్, వ్యాపారస్థులు నిన్నటి వరకు హడలిపోతున్నారని.. కాంట్రాక్టర్‌గా వచ్చాను కాబట్టే ప్రజా సేవ చేస్తున్నానని ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-02-09T15:50:50+05:30 IST