Nellore: నా భార్య మానసిక అనారోగ్యంతో బాధపడుతోంది: మాజీ మంత్రి సోదరుడు

ABN , First Publish Date - 2023-07-30T11:48:53+05:30 IST

నెల్లూరు: సోషల్ మీడియాలో కృష్ణప్రియకు సంబంధించిన వీడియోలపై మాజీ మంత్రి నారాయణ సోదరుడు సుబ్రహ్మణ్యం స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ...

Nellore: నా భార్య మానసిక అనారోగ్యంతో బాధపడుతోంది: మాజీ మంత్రి సోదరుడు

నెల్లూరు: సోషల్ మీడియాలో కృష్ణప్రియకు సంబంధించిన వీడియోలపై మాజీ మంత్రి నారాయణ సోదరుడు సుబ్రహ్మణ్యం స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘‘నా పేరు పొంగూరు సుబ్రహ్మణ్యం నా భార్య కృష్ణప్రియ. తాను కొద్ది రోజులుగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారం రోజులుగా తాను కొన్ని వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టారని.. ఇది మాకు, మా కుటుంబం పరువుకు భంగం కలిగించేలా.. అభ్యంతరకరంగా ఉన్నాయి. 2017లో కృష్ణప్రియను సైక్రియాటిస్టుకు చూపించామని, అయినా వ్యాధి నయం కాకపోవడంతో 2019లో గుంటూరులో మరో సైక్రియాటిస్టుకు చూపించాము.. అయినా రికవర్ కాలేదు. 2020లో మానస హాస్పిటల్ తెలంగాణలో చూపించాము. అయినా వ్యాధి నయంకాకపోవడంతో గచ్చిభౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో చూపించాం, తర్వాత 2023 మేలో కృష్ణప్రియకు క్యాన్సర్ అని వైద్యులు చెప్పారని, యశోద ఆస్పత్రిలో డాక్టర్ శ్రీకాంత్ నా భార్యకు సర్జరీ చేశారు.. తర్వాత 8 కిమో థెరపీలు చేయించమన్నారు. ఇప్పటి వరకు రెండు థెరపీలు పూర్తి చేశామని, ఇంకా నా భార్యకు ట్రీట్‌మెంట్ ఇప్పిస్తూ.. తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. క్యాన్సర్‌కు చికిత్స కారణంగా సైక్రియాటిస్టు మందులు నిలిపివేశారు.. అందువల్ల ఆమె వీడియోలను మానవతా ధృక్పధంతో ఎవరూ పట్టించుకోవద్దు’’ అంటూ పొంగూరు సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2023-07-30T11:57:40+05:30 IST