Nellore: డాక్టర్ హత్య కేసులో భార్య, కొడుకుతో పాటు మరో ముగ్గురికి జీవితఖైదు..

ABN , First Publish Date - 2023-03-24T13:11:33+05:30 IST

నెల్లూరు: ప్రముఖ వైద్యుడు డాక్టర్ విజయకుమార్ హత్య కేసులో భార్య, కుమారుడుతో పాటు మరో ముగ్గురికి జీవితఖైదుతోపాటు ఒక్కొక్కరికి రూ.2 వేల జరిమానా విధిస్తూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

Nellore: డాక్టర్ హత్య కేసులో భార్య, కొడుకుతో పాటు మరో ముగ్గురికి జీవితఖైదు..

నెల్లూరు: ప్రముఖ వైద్యుడు డాక్టర్ విజయకుమార్ హత్య కేసు (Dr. Vijay Kumar Murder Case)లో భార్య, కుమారుడుతో పాటు మరో ముగ్గురికి జీవితఖైదు (Life Imprisonment)తోపాటు ఒక్కొక్కరికి రూ.2 వేల జరిమానా విధిస్తూ కోర్టు (Court) సంచలన తీర్పు ఇచ్చింది. వివరాల్లోకి వెళితే... ఎనిమిదేళ్ల క్రితం డాక్టర్ విజయకుమార్ దారుణ హత్యకు గురయ్యారు. వైద్య రంగంలో ఎంతో మందికి ఆయన విస్తృత సేవలు అందించిన డాక్టర్ హత్యపై పౌరసమాజం న్యాయం కోసం పోరాడింది. 2015 మే 28న ఈ సంఘటన జరిగింది.

భార్య, భర్తల మధ్య వివాదంతో పాటు ఆస్తి తగాదాలే హత్యకి కారణంగా పోలీసులు విచారణలో తేల్చారు. డాక్టర్ విజయకుమార్ భార్య వెలగపూడి ఉషారాణి, కుమారుడు గుడిగుంట సుందరయ్య, మరో ముగ్గురు కూనిశెట్టి శ్రీధర్, మీసాల గంగరాజు, పామాంజి పోలురాజులు కుట్ర పన్ని విజయ్ కుమార్‌ను హత్య చేసినట్లు కోర్టులో నిర్ధారణ కావడంతో న్యాయస్థానం ఈ మేరకు శిక్ష విధించింది. కాగా ఈ కేసులో మూడవ నిందితుడు కూనిశెట్టి శ్రీధర్.. జిల్లా లా బార్ అసోసియేన్ ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగుతున్నారు.

Updated Date - 2023-03-24T13:11:33+05:30 IST