YuvaGalam Padayatra: 105వ రోజుకు చేరుకున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర

ABN , First Publish Date - 2023-05-20T07:18:55+05:30 IST

టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) విజయవంతంగా కొనసాగుతోంది. నేటితో లోకేష్ పాదయాత్ర 105వ రోజుకు చేరుకుంది.

YuvaGalam Padayatra: 105వ రోజుకు చేరుకున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర

నంద్యాల: టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) విజయవంతంగా కొనసాగుతోంది. నేటితో లోకేష్ పాదయాత్ర 105వ రోజుకు చేరుకుంది. నేడు నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించింది. బనగానపల్లె (Banaganapalli)లోని పెట్రోలు బంకు, ఆస్ధానం సెంటర్, పొట్టి శ్రీరాములు సెంటర్ వరకు లోకేస్ పాదయాత్ర చేస్తారు. అనంతరం ఓకమిట్ట జంక్షన్, వివిధ సామాజిక వర్గీయులతో ఆయన సమావేశమవుతారు. సాయంత్రం 5 గంటలకు బనగానపల్లెలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. లోకేష్ చేస్తున్న పాదయాత్రకు (Lokesh Padayatra) విశేష ఆదరణ లభిస్తోంది. అడుగడుగునా లోకేష్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో యువగళం పాదయాత్ర కొనసాగుతోంది.

104వ రోజు పాదయాత్ర ఇలా సాగింది

104వ రోజు యువగళం పాదయాత్ర నంద్యాల నియోజకవర్గంలోని రాయపాడు విడిది కేంద్రం నుంచి మొదలైంది. అక్కడి నుంచి టంగుటూరు పెద్దమ్మ తల్లి దేవాలయం దాటి బనగానపల్లె నియోజకవర్గంలోకి ప్రవేశించింది. అక్కడి నుంచి టంగుటూరు, అప్పలాపురం మీదుగా సాగే కైప గ్రామశివారు విడిది కేంద్రానికి చేరుకుంది. శుక్రవారం పాదయాత్ర 11కి.మీ. సాగగా, ఇప్పటి వరకు 1330.1కి.మీ. పూర్తయింది.

Updated Date - 2023-05-20T07:18:55+05:30 IST