Share News

Nara Lokesh: యలమంచిలిలో హోరెత్తుతున్న లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర

ABN , Publish Date - Dec 14 , 2023 | 01:24 PM

నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర యలమంచిలికి చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణంలోని వీధులన్నీ టీడీపీ

Nara Lokesh: యలమంచిలిలో హోరెత్తుతున్న లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర

అనకాపల్లి: నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర యలమంచిలికి చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణంలోని వీధులన్నీ టీడీపీ కార్యకర్తలతో కిటకిటలాడాయి. ప్రధాన రహదారి, రోడ్లకు ఇరువైపులా జనం బారులు తీరారు. అడుగడుగునా యువనేతకు నీరాజనాలు పడుతూ మహిళలు సంఘీభావం తెలిపారు. కాగా.. పన్నులపోటు, పెరిగిన ధరలతో బతుకుబండి లాగలేకపోతున్నామని మహిళల ఆవేదన వ్యక్తం చేస్తూ యువనేతకు తమగోడును వెలిబుచ్చారు. మరో 3నెలల్లో చంద్రబాబు నేతృత్వంలో రాబోయే ప్రజాప్రభుత్వం పన్నులతోపాటు ధరలను అదుపుచేసి ఉపశమనం కలిగిస్తానని లోకేష్ భరోసా ఇచ్చారు.

Updated Date - Dec 14 , 2023 | 01:24 PM