Raghu RamaRaju: ఏపీ హైకోర్టులో ఎంపీ రఘురామరాజు కీలక పిటిషన్
ABN , First Publish Date - 2023-01-03T18:06:01+05:30 IST
తనపై ఉన్న కేసుల వివరాలు ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలంటూ వైసీపీ (YSRCP) రెబల్ ఎంపీ రఘురామరాజు (Raghu Rama Krishna Raju) ఏపీ హైకోర్టులో (AP High Court) పిటిషన్ వేశారు.
అమరావతి: తనపై ఉన్న కేసుల వివరాలు ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలంటూ వైసీపీ (YSRCP) రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు (Raghu Rama Krishna Raju) ఏపీ హైకోర్టులో (AP High Court) పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చింది. పిటిషనర్ రఘురామకృష్ణంరాజు తరపున న్యాయవాది ఉమేష్‌చంద్ర వాదనలు వినిపించారు. రాష్ట్రంలో ఇప్పటికే పెండింగ్లో ఉన్న కేసులతో పాటు కొత్తగా పెట్టిన ఎఫ్‌ఐఆర్‌ల వివరాలు ఇవ్వాలని డీజీపీకి (DGP) లేఖ రాశామని.. అయినప్పటికీ డీజీపీ నుంచి స్పందన రాలేదని పేర్కొన్నారు. సంక్రాంతి (Pongal) సమయంలో తన పార్లమెంట్ నియోజకవర్గానికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు పిటిషన్‌లో రఘురామకృష్ణంరాజు తెలిపారు. అయితే నియోజకవర్గానికి వెళ్తే పోలీసులు అప్పటికప్పుడే ఎఫ్‌ఐఆర్‌ను సృష్టించి అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఈ అంశంపై తక్షణమే విచారణ చేపట్టాలని కోర్టును లాయర్ ఉమేష్‌చంద్ర కోరారు. అయితే పిటిషన్ బెంచ్ మీదకు వచ్చిన వెంటనే "నాట్ బిఫోర్ మీ" అని న్యాయమూర్తి జస్టిస్ రఘునందనరావు అన్నారు.