Director Ravibabu: 73ఏళ్ల వ్యక్తిని హింసించడం దారుణం.. చంద్రబాబు అరెస్ట్‌పై దర్శకుడు రవిబాబు రిక్వెస్ట్

ABN , First Publish Date - 2023-09-30T10:07:11+05:30 IST

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను ప్రతీ ఒక్కరూ ఖండిస్తున్నారు. అరెస్ట్ అక్రమమని పార్టీలకు అతీతంగా నేతలు చెబుతున్నారు. తాజాగా సినీ దర్శకుడు రవిబాబు కూడా చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించారు.

Director Ravibabu: 73ఏళ్ల వ్యక్తిని హింసించడం దారుణం.. చంద్రబాబు అరెస్ట్‌పై దర్శకుడు రవిబాబు రిక్వెస్ట్

అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో (Skill Development Case) అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu Arrest) ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను ప్రతీ ఒక్కరూ ఖండిస్తున్నారు. అరెస్ట్ అక్రమమని పార్టీలకు అతీతంగా నేతలు చెబుతున్నారు. తాజాగా సినీ దర్శకుడు రవిబాబు (Movie Director Ravibabu) కూడా చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించారు. ప్రతి క్షణం ప్రజల కోసమే ఆలోచించే చంద్రబాబు డబ్బు కోసం కక్కుర్తి పడే మనిషి కాదని తెలిపారు. ఎటువంటి ఆధారం లేకుండా అక్రమ కేసులు పెట్టి చంద్రబాబును జైల్లో పెట్టి ఎందుకు హింసిస్తున్నారో అర్ధం కావటం లేదని ఆయన అన్నారు.


రవిబాబు ఏమన్నారంటే...

‘‘జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. సినిమా వాళ్ల గ్లామర్ గానీ.. రాజకీయ నాయకుల పవర్ గానీ అస్సలు శాశ్వతం కాదు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వచ్చిన కష్టాలు కూడా శాశ్వతం కాదు. ఎన్టీఆర్‌ కుటుంబం, చంద్రబాబు నాయుడు కుటుంబం.. తమ కుటుంబానికి అత్యంత ఆప్తులు. చంద్రబాబు ఏదైనా పని అనుకుంటే అన్ని కోణాల్లో ఆలోచించి, అందరినీ సంప్రదించి.. ఎవరికీ ఇబ్బందులు కలిగించకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజే చివరి రోజని తెలిసినా.. వచ్చే 50 సంవత్సరాలకు సామాజిక అభివృద్ధికి ప్రణాళికలు వేస్తారు. డబ్బు కోసం కక్కుర్తి పడే మనిషి కాదు. ఎటువంటి ఆధారం లేకుండా అక్రమ కేసులు పెట్టి చంద్రబాబును జైల్లో పెట్టి ఎందుకు హింసిస్తున్నారో అర్ధం కావటం లేదు. రాజకీయాల్లో ఎత్తులు పైఎత్తులు సహజం. కానీ 73ఏళ్ల వయస్సున్న వ్యక్తిని జైల్లో పెట్టి హింసించడం చాలా దారుణం. ఏ పవర్‌ను ఉపయోగించి చంద్రబాబును జైల్లో పెట్టారో.. అదే పవర్‌ను ఉపయోగించి విడుదల చేయాలి. ఆయనను బయటకు తీసుకొచ్చి విచారణ చేయాలి.. విచారణకు చంద్రబాబు కచ్చితంగా సహకరిస్తారు. దేశాన్ని వదిలి పారిపోరు. చరిత్ర మిమ్మల్ని ఎలా గుర్తించుకోవాలని అనుకుంటున్నారు. కక్షతో రగిలే కసాయి వాళ్లనా.. లేక జాలి మనసు, విలువలు ఉన్న మంచి నాయకులుగా గుర్తించాలా. దయచేసి చంద్రబాబును వదిలిపెట్టండి’’ అంటూ రవిబాబు కోరారు. ఈ మేరకు రవిబాబు ఓ వీడియోను విడుదల చేశారు.

Updated Date - 2023-09-30T10:28:26+05:30 IST