Nara Lokeshతో పాటు MLC పదవీకాలం ముగియనున్న సభ్యులు వీరే..

ABN , First Publish Date - 2023-02-27T22:46:22+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో మరో 10 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.

 Nara Lokeshతో పాటు MLC పదవీకాలం ముగియనున్న సభ్యులు వీరే..

ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో(Telugu states) మరో 10 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం( Election Commission) షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనున్నడంతో ఈ షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 14న నామినేషన్ల పరిశీలన, మార్చి 23న ఎన్నికల పోలింగ్, కౌంటింగ్‌ జరగనుంది.ఏపీలో 7, తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది.

ఏపీలో..

ఏపీలో 7, తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నికల తేదీలను ఖరారు చేసింది.ఏపీలో నారా లోకేష్‌( Nara Lokesh), చల్లా భగీరథరెడ్డి, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు,.. డొక్కా మాణిక్య వరప్రసాద్‌, పీవీవీ సూర్యనారాయణరాజు, గంగుల ప్రభాకర్‌రెడ్డి పదవీకాలం ముగియనున్నది.

తెలంగాణలో..

తెలంగాణలో ఎమ్మెల్సీ పదవీకాలం ముగుస్తున్న సభ్యులలో అలిమినేట్ కృష్ణారెడ్డి,.. వి.గంగాధర్‌ గౌడ్‌, కూర్మయ్యగారి నవీన్‌కుమార్‌ పదవీకాలం ముగియనున్నది.

Updated Date - 2023-02-27T22:55:13+05:30 IST