YCP: వైసీపీ ఎమ్మెల్యేకు నిరసన సెగ

ABN , First Publish Date - 2023-05-27T20:26:55+05:30 IST

జిల్లాలోని పాణ్యం మండలం భూపనపాడు గ్రామంలో వైసీపీ (YCP) ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి (MLA Katasani Ram Bhupal Reddy)కి నిరసన సెగ ఎదురయింది.

YCP: వైసీపీ ఎమ్మెల్యేకు నిరసన సెగ

నంద్యాల: జిల్లాలోని పాణ్యం మండలం భూపనపాడు గ్రామంలో వైసీపీ (YCP) ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి (MLA Katasani Ram Bhupal Reddy)కి నిరసన సెగ ఎదురయింది. కాలనీలోకి రావద్దంటూ రహదారిపై బైఠాయించి ఎమ్మెల్యేను స్థానిక మహిళలు అడ్డుకున్నారు. సర్పంచ్ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో కాలనీకి రావొద్దు అంటూ మహిళలు అడ్డుకున్నారు. నిరసనను వీడియోలు తీస్తున్న యువకుల సెల్ ఫోన్‌లను పోలీసులు, ఎమ్మెల్యే అనుచరులు లాక్కొని ఆ వీడియోలను డిలీట్ చేసినట్లు బాధితులు చెబుతున్నారు. దాంతో యువకులకు ఎమ్మెల్యే అనుచరులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Updated Date - 2023-05-27T20:26:55+05:30 IST