Chinarajappa: చంద్రబాబు ఆరోగ్యంగా.. ధైర్యంగా ఉన్నారు

ABN , First Publish Date - 2023-10-03T12:24:35+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు జైలులో ఆరోగ్యంగా ఉన్నారని.. ధైర్యంగా ఉన్నారని ఎమ్మెల్యే చినరాజప్ప తెలిపారు.

Chinarajappa: చంద్రబాబు ఆరోగ్యంగా.. ధైర్యంగా ఉన్నారు

రాజమండ్రి: టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) జైలులో ఆరోగ్యంగా ఉన్నారని.. ధైర్యంగా ఉన్నారని ఎమ్మెల్యే చినరాజప్ప (MLA Chinarajappa) తెలిపారు. మంగళవారం చంద్రబాబుతో రాజమండ్రి సెంట్రల్ జైలులో నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari), బ్రహ్మణి (Brahmani), చినరాజప్ప ములాఖత్ అయ్యారు. అనంతరం చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ.. కార్యకర్తలను దైర్యంగా ఉండమని చెప్పారన్నారు. చంద్రబాబుకు బెయిల్ రాకుండా జగన్ కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రం కోసమే చంద్రబాబు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌లో ఇబ్బంది పెడుతున్నారన్నారు. జనసేన, టీడీపీ పొత్తుపై ఉమ్మడి కార్యాచరణతో వెళ్ళాలని చంద్రబాబు చెప్పారని చినరాజప్ప పేర్కొన్నారు.

Updated Date - 2023-10-03T12:24:35+05:30 IST