AP News: త్వరలో ‘మన ఇంటికి మన మద్దిపాటి’

ABN , First Publish Date - 2023-06-10T15:07:03+05:30 IST

టీడీపీ (TDP)ని అధికారంలోకి తీసుకురావటమే తమ కర్తవ్యమని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గోపాలపురం నియోజకవర్గ ఇంచార్జ్ మద్దిపాటి వెంకటరాజు స్పష్టం చేశారు. శుక్రవారం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో మద్దిపాటి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

AP News: త్వరలో ‘మన ఇంటికి మన మద్దిపాటి’

ద్వారకా తిరుమల: టీడీపీ (TDP)ని అధికారంలోకి తీసుకురావటమే తమ కర్తవ్యమని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గోపాలపురం నియోజకవర్గ ఇంచార్జ్ మద్దిపాటి వెంకటరాజు (Maddipati Venkataraju) స్పష్టం చేశారు. శుక్రవారం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో మద్దిపాటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ‘భవిష్యత్తు గ్యారెంటీ మేనిఫెస్టో’ పోస్టర్ స్వామి వారి వద్ద ఉంచి పూజలు చేశారు. ఈ సందర్భంగా మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందించడానికి టీడీపీకి బలాన్ని ఇవ్వాలని స్వామివారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా త్వరలో ‘టీడీపీ భవిష్యత్తు గ్యారంటీ పోస్టర్’ తో మన ఇంటికి మన మద్దిపాటి కార్యక్రమాన్ని చేపడుతామని వివరించారు. ఐదు నెలల పాటు నియోజకవర్గంలో పర్యటిస్తామని తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి వెళ్లి వివరిస్తామని మద్దిపాటి ప్రకటించారు.

Untitled-2.jpg

Updated Date - 2023-06-10T15:07:22+05:30 IST