ISRO: రేపు నింగిలోకి ఎల్‌వీఎం3-ఎం3 రాకెట్‌

ABN , First Publish Date - 2023-03-25T20:55:51+05:30 IST

అంతరిక్షంలోకి 36 ఉపగ్రహాలను మోసుకువెళ్లే భారీ రాకెట్‌ (Rocket)ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రేపు (ఆదివారం) ప్రయోగించనుంది.

ISRO: రేపు నింగిలోకి ఎల్‌వీఎం3-ఎం3 రాకెట్‌

సూళ్లూరుపేట: అంతరిక్షంలోకి 36 ఉపగ్రహాలను మోసుకువెళ్లే భారీ రాకెట్‌ (Rocket)ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రేపు (ఆదివారం) ప్రయోగించనుంది. రేపు ఉదయం 9 గంటలకు ఎల్‌వీఎం3-ఎం3 రాకెట్‌ను తిరుపతి జిల్లా శ్రీహరికోట (Sriharikota)లోని షార్‌ రెండో ప్రయోగవేదిక నుంచి ప్రయోగించనున్నారు. యూకేకి చెందిన 5805 కిలోల బరువైన 36 కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలను పొదుపుకున్న రాకెట్‌ కౌంట్‌డౌన్‌ (Rocket Countdown) శనివారం ఉదయం 8:30 గంటలకు ప్రారంభమైంది. 24:30 గంటలు నిరాటకంగా కౌంట్‌డౌన్‌ కొనసాగిన అనంతరం ఎల్‌వీఎం3-ఎం3 రాకెట్‌ నింగిలోకి ఎగరనుంది. ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌.సోమనాథ్‌ షార్‌కు చేరుకొని ప్రయోగ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రయోగ వేదికపై ఉన్న ఎల్‌వీఎం3-ఎం3 రాకెట్‌ను షార్‌ డైరెక్టర్‌ ఆర్ముగం రాజరాజన్‌, శాస్త్రవేత్తలతో కలిసి సందర్శించారు. శనివారం ఉదయం సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆలయాన్ని సందర్శించి రాకెట్‌ విజయం కోసం ఇస్రో చైర్మన్‌ పూజలు చేశారు. ఇస్రో న్యూ స్పేస్‌ ఇండియాతో కుదుర్చుకొన్న వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఈ ప్రయోగాన్ని చేపట్టుతోంది. షార్‌కు మన శాస్త్రవేత్తలతో పాటు విదేశీ శాస్త్రవేత్తలు చేరుకున్నారు. ఇప్పటి వరకు ఇస్రో ఈ తరహా ప్రయోగాలు 5 చేపట్టగా అన్నీ విజయాలందించాయి. ఇది ఆరో ప్రయోగం కావడం విశేషం.

Updated Date - 2023-03-25T20:55:51+05:30 IST