YS Viveka Murder Case : వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్ అరెస్ట్‌పై బులెటిన్ విడుదల.. మొత్తం తెలిసిపోయిందే..

ABN , First Publish Date - 2023-07-04T21:48:51+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) కీలక అప్డేట్ వచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉంటూ వరుసగా సీబీఐ (CBI) విచారణ ఎదుర్కొన్న ఎంపీ అవినాష్‌ రెడ్డిని (MP Avinash Reddy) జూన్-03 తారీఖున సీబీఐ అరెస్ట్ చేసిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే..

YS Viveka Murder Case : వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్ అరెస్ట్‌పై బులెటిన్ విడుదల.. మొత్తం తెలిసిపోయిందే..

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) కీలక అప్డేట్ వచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉంటూ వరుసగా సీబీఐ (CBI) విచారణ ఎదుర్కొన్న ఎంపీ అవినాష్‌ రెడ్డిని (MP Avinash Reddy) జూన్-03 తారీఖున సీబీఐ అరెస్ట్ చేసిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇంతవరకూ అటు అవినాష్ గానీ.. ఇటు సీబీఐ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఇందులో నిజానిజాలెంత అనేది తెలియరాలేదు.

YS-Viveka-PSDD.jpg

అవును నిజమే..

తాజాగా.. ఈ అరెస్ట్‌పై లోక్‌సభ సచివాలయం (Loksabha Sacivalayam) బులెటిన్‌ విడుదల చేయడంతో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అవినాష్ అరెస్ట్‌ నిజమేనని ఇటీవలే సచివాలయంకు సీబీఐ లేఖ రాసింది. దీంతో అధికారికంగా ప్రకటన వచ్చేసింది. అరెస్ట్‌కు సంబంధించిన సమాచారం సోమవారం నాడు అందినట్లు సచివాలయం బులెటిన్‌లో పేర్కొంది. అవినాష్‌ను జూన్-03న అరెస్ట్ చేసి వెంటనే విడుదల చేసినట్లు సీబీఐ లేఖలో పేర్కొందని.. బులెటిన్‌లో లోక్‌సభ సచివాలయం పేర్కొంది. ఇన్నిరోజులుగా గోప్యంగా ఉంచిన ఈ వ్యవహారం మొత్తం బయటపడటంతో ఒకింత విమర్శలు వస్తున్నాయి.

avinashcbi-1679033008.jpg

కాగా.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో గోప్యంగా కీలక పరిణామం చోటుచేసుకున్నట్టు గత నెలలో వార్తలు గుప్పుమన్నాయి. మే-31న హైకోర్టు ముంద‌స్తు బెయిల్ ఆదేశాల మేర‌కు రూ.5 లక్షల పూచీక‌త్తుపై అవినాశ్ రెడ్డిని విడుద‌ల చేసిన‌ట్లు తెలిసింది. అనంతరం అవినాశ్రెడ్డిని ఏ8గా సీబీఐ చేర్చింది. అవినాశ్రెడ్డి అరెస్ట్ను సీబీఐ గోప్యంగా ఉంచడం ఈ మొత్తం ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్. భాస్కర్‌రెడ్డి బెయిల్పై దాఖ‌లు చేసిన కౌంట‌ర్లో అవినాశ్ని ఏ8గా సీబీఐ పేర్కొనడం గమనార్హం. అంతేకాదు, భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ పలు కీలక అంశాలను ప్రస్తావించింది. అప్పట్లో అరెస్ట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశమే అయ్యింది.

CBI-Enquiry-Reshikesh.jpg

Updated Date - 2023-07-04T21:50:43+05:30 IST