Kurnool Dist.: కర్నూలు జిల్లాలో ఒకే రోజు నలుగురు రైతుల బలవన్మరనం
ABN , First Publish Date - 2023-08-20T09:24:01+05:30 IST
కర్నూలు జిల్లా: ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒకే రోజు నలుగురు రైతులు బలవన్మరనం చెందారు. అవుకు మండలం, కునుకుంట్లలో నాగేష్ (23)అనే యువరైతు, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
కర్నూలు జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఒకే రోజు నలుగురు రైతులు (Four Farmers) బలవన్మరనం (Suicide) చెందారు. అవుకు మండలం, కునుకుంట్లలో నాగేష్ (23)అనే యువరైతు, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నందవరం మండలం, గురజాలకు చెందిన కురువ బీరప్ప (33) అనే రైతు పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. డోన్ మండలం, కొచ్చెర్వుకు చెందిన రైతు శివకుమార్ (31) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సి. బెలగల్ మండలం, ఇనగండ్లకు చెందిన శ్రీకృష్ణ దేవరాయ (52) పొలం దగ్గర ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆయా ప్రాంతాలకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.