TG Venkatesh: ఎన్నికల కోసమే జనసేన, బీజేపీల మధ్య పొత్తు

ABN , First Publish Date - 2023-01-24T13:50:02+05:30 IST

జనసేన, బీజేపీ మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయని మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తెలిపారు.

TG Venkatesh: ఎన్నికల కోసమే జనసేన, బీజేపీల మధ్య పొత్తు

కర్నూలు: జనసేన, బీజేపీ మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయని మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ (Former Rajya Sabha member TG Venkatesh) తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల కోసమే జనసేన, బీజేపీల మధ్య పొత్తు (Alliance between Jana Sena and BJP) అని స్పష్టం చేశారు. పొత్తులు అనేవి ఎన్నికల్లో బిగ్ గేమ్‌గా పేర్కొన్నారు. కేంద్రం పథకాలకు ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించి స్కీమ్‌లకు తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం నిధులను సద్వినియోగం చేసుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందన్నారు. 2024 ఎన్నికల్లో కేంద్రం రాష్టానికి ఇచ్చిన నిధులను ప్రజలకు వివరిస్తూ నేరుగా బీజేపీకి ఓటు వేయాలని కోరే దిశగా బీజేపీ వెళ్తోందని చెప్పారు. సిద్దేశ్వరం వద్ద కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జ్ కం చెక్ డ్యామ్ కట్టాలని తాను ఇంతకు ముందే కేంద్ర మంత్రులకు ప్రతిపాదించినట్లు తెలిపారు. ఏపీ, కర్నాటక, తెలంగాణ వాటర్ క్లియరెన్స్ తీసుకుంటే ఐకానిక్ బ్రిడ్జ్ కం డ్యామ్ కట్టేందుకు బీజేపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని టీజీ వెంకటేష్ వెల్లడించారు.

Updated Date - 2023-01-24T13:50:44+05:30 IST