Crime New: కర్నూలు జిల్లాలో దారుణం...

ABN , First Publish Date - 2023-06-11T11:15:45+05:30 IST

కర్నూలు జిల్లా: కౌతాలం మండలం, బాపురంలో దారుణం జరిగింది. అత్త హనుమంతమ్మ, భార్య మహాదేవిని భర్త రమేష్ నరికి చంపాడు. రెండు నెలల క్రితమే కర్ణాటక, టెక్కలికోటకు చెందిన రమేశ్‌కు మహాదేవికి వివాహం జరిగింది.

Crime New: కర్నూలు జిల్లాలో దారుణం...

కర్నూలు జిల్లా: కౌతాలం మండలం, బాపురంలో దారుణం జరిగింది. అత్త హనుమంతమ్మ, భార్య మహాదేవిని భర్త రమేష్ నరికి చంపాడు. రెండు నెలల క్రితమే కర్ణాటక, టెక్కలికోటకు చెందిన రమేశ్‌కు మహాదేవికి వివాహం జరిగింది. అయితే భార్య మహాలక్ష్మిపై భర్త అనుమానం పెంచుకున్నాడు. శనివారం (9వ తేదీ) అత్తగారింటికి వచ్చిన రమేష్.. నిద్రపోతున్న మహాలక్ష్మి, ఆమె తల్లి హనుమంతమ్మను అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఇంట్లోని మృత దేహాలను ఉంచి తాళం వేసి కర్నాటకకు వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2023-06-11T11:15:45+05:30 IST