AP News: వైసీపీ ఎమ్మెల్యేకు టీడీపీ నేత ఓపెన్ ఛాలెంజ్

ABN , First Publish Date - 2023-04-11T22:29:30+05:30 IST

వైసీపీ (YCP) ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి (Kangati Sreedevi)కి పత్తికొండ నియోజకవర్గ టీడీపీ (TDP) ఇంచార్జ్ కేఈ శ్యాం బాబు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.

AP News: వైసీపీ ఎమ్మెల్యేకు టీడీపీ నేత ఓపెన్ ఛాలెంజ్

కర్నూలు: వైసీపీ (YCP) ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి (Kangati Sreedevi)కి పత్తికొండ నియోజకవర్గ టీడీపీ (TDP) ఇంచార్జ్ కేఈ శ్యాం బాబు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో పత్తికొండ ఎంత అభివృద్ధి జరిగిందని, ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం పత్తికొండను ఏ మేరకు అభివృద్ధి చేశారో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. పత్తికొండ నియోజక వర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు భూ కబ్జాలు, ఇసుక దందా, అక్రమ మద్యం వ్యాపారాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పత్తికొండ నియోజకవర్గానికి నారా లోకేష్ (Lokesh) యువగళం పాదయాత్ర వస్తున్న సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి భయపడుతున్నారని విమర్శించారు.

Updated Date - 2023-04-11T22:29:30+05:30 IST