AP News: దాని ద్వారా రూ.10వేల కోట్లు దోచుకున్నారు: లోకేష్
ABN , First Publish Date - 2023-05-03T18:31:34+05:30 IST
రాష్ట్రంలో వైసీపీ (YCP) అధికారంలోకి వచ్చాక గత నాలుగేళ్లలో జగన్ అండ్ కో ఇసుక అక్రమరవాణా ద్వారా రూ.10వేల కోట్లు దోచుకు
కర్నూలు: రాష్ట్రంలో వైసీపీ (YCP) అధికారంలోకి వచ్చాక గత నాలుగేళ్లలో జగన్ అండ్ కో ఇసుక అక్రమరవాణా ద్వారా రూ.10వేల కోట్లు దోచుకున్నారని టీడీపీ (TDP) నేత నారా లోకేష్ (Nara Lokesh) ఆరోపించారు. పాదయాత్రలో భాగంగా టీడీపీ యువనేత లోకేష్‌ను అనుగొండ ప్రజలు కలిశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. ఇసుక అక్రమ తవ్వకాల కోసం అన్నమయ్య ప్రాజెక్టు వద్ద వరదల సమయంలో గేట్లు ఎత్తకపోవడంతో 61మంది అమాయక ప్రజలు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోనే ఇసుక మాఫియా రాష్ట్రవ్యాప్తంగా పేట్రేగిపోతోందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపుతామన్నారు. అనుగొండ వాగు పూడిక తీత చేపట్టి ముంపుబారిన పడకుండా రక్షణ కల్పిస్తామన్నారు.