Super Star: శుక్రవారం సాయంత్రం చంద్రబాబు ఇంటికి సూపర్ స్టార్ రజనీకాంత్

ABN , First Publish Date - 2023-04-28T11:05:25+05:30 IST

అమరావతి: విజయవాడకు వచ్చిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (SuperStar Rajinikanth) శుక్రవారం సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఇంటికి రానున్నారు.

Super Star: శుక్రవారం సాయంత్రం చంద్రబాబు ఇంటికి సూపర్ స్టార్ రజనీకాంత్

అమరావతి: విజయవాడకు వచ్చిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (SuperStar Rajinikanth) శుక్రవారం సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఇంటికి రానున్నారు. రజనీకాంత్‌ను తేనెటి విందుకు ఆహ్వానించారు. ఈ రోజు సాయంత్రం మూడు గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి సూపర్ స్టార్ రానున్నారు. తేనేటి విందు అనంతరం అక్కడి నుంచి రజినీకాంత్, నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), చంద్రబాబు కుటుంబసభ్యులు.. అందరూ కలిసి సాయంత్రం ఐదు గంటలకు ఉండవల్లి నివాసం నుంచి పోరంకి అనుమోలు గార్డెన్స్‌లో జరగనున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సభ వద్దకు వెళ్ళనున్నారు.

స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతి వేడుకల అంకురార్పణ సభలో పాల్గొనేందుకు రజినీకాంత్ విజయవాడకు వచ్చారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో రజినీకాంత్‌కు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (MLA Nandamuri Balakrishna), టీడీ జనార్దన్, సావనీర్ కమిటీ రిసీవ్ చేసుకుని ఘన స్వాగతం పలికారు. గతంలో 2004 కృష్ణానది పుష్కరాల సందర్భంలో కృష్ణాజిల్లాకు వచ్చిన రజినీకాంత్.. మళ్లీ ఇప్పుడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకల అంకురార్పణ సభలో పాల్గొనేందుకు విజయవాడకు వచ్చారు.

ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలపై శుక్రవారం రెండు పుస్తకాలు విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు, ప్రజల్ని చైతన్య పరుస్తూ వివిధ వేదికల మీద చేసిన ప్రసంగాలతో కూడిన రెండు పుస్తకాలను విడుదల చేయనున్నారు.

Updated Date - 2023-04-28T11:05:25+05:30 IST