Chandrababu Arrest: న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-09-11T13:10:00+05:30 IST

అమరావతి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుపై సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ప్రాణహాని ఉందని, ఆయనను జైల్లో ఉంచడం ప్రమాదమని చెప్పారు.

Chandrababu Arrest: న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా సంచలన వ్యాఖ్యలు

అమరావతి: టీడీపీ అధినేత (TDP Chief), మాజీ సీఎం (Ex CM) చంద్రబాబు (Chandrababu) అరెస్టు (Arrest)పై సుప్రీం కోర్టు (Supreme Court) సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా (Senior Advocate Siddharth Luthra) సంచలన వ్యాఖ్యలు (Sensational Comments) చేశారు. చంద్రబాబుకు ప్రాణహాని ఉందని, ఆయనను జైల్లో ఉంచడం ప్రమాదమని చెప్పారు. ఈ సందర్బంగా సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడారు. గతంలో వెస్ట్ బెంగాల్‌కు చెందిన మంత్రుల విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును చంద్రబాబు కేసులోనూ ప్రస్తావిస్తామని అన్నారు. హౌస్ అరెస్టు పిటిషన్‌పై వాదనలు వినిపిస్తామని, బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నామని తెలిపారు.

చంద్రబాబుకు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో విజయవాడకు వంద కి.మీ. దూరంలో ఉంచాలని, అంతకంటే ఎక్కువ దూరం తీసుకువెళితే ప్రమాదమని న్యాయవాది సిద్దార్ద్ లూథ్రా పేర్కొన్నారు. దీనిపై కోర్టులో పిటిషన్ వేస్తామని, వాదనలు గట్టిగా వినిపిస్తామని చెప్పారు. చంద్రబాబుకు ప్రాణహాని ఉందని ప్రపంచం మొత్తానికి తెలుసునని, ఆయనను జైల్లో ఉంచడం సరికాదని అన్నారు. బెయిల్ పిటిషన్ కంటే ముందు హౌస్ అరెస్టు పిటిషన్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. చంద్రబాబు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా సుదీర్ఘకాలం సేవలందించిన నేపథ్యంలో ఆయనకు శత్రువులు, మిత్రులు అదే స్థాయిలో ఉంటారని సిద్దార్థ్ లూథ్రా వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-09-11T13:10:00+05:30 IST