Share News

AP News: గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద పోలీసుల ఓవరాక్షన్

ABN , First Publish Date - 2023-12-01T13:43:16+05:30 IST

గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద పోలీసుల ఓవరాక్షన్ టీడీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఎయిర్ పోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు తరలివస్తున్నాయి. ఈ రిపోర్ట్ వెలుపలే టీడీపీ శ్రేణులను పోలీసులు నిలిపివేస్తున్నారు.

AP News: గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద పోలీసుల ఓవరాక్షన్

అమరావతి: గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద పోలీసుల ఓవరాక్షన్ టీడీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఎయిర్ పోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు తరలివస్తున్నాయి. ఈ రిపోర్ట్ వెలుపలే టీడీపీ శ్రేణులను పోలీసులు నిలిపివేస్తున్నారు. మీడియా ప్రతినిధులకు సైతం ఆంక్షలు విధిస్తున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ ప్రస్తుతం పోలీసుల వలయంలో ఉంది. అధికార పక్ష నేతలకు ఒకలాగా.. ప్రతిపక్ష నాయకులకు మరోలా పోలీసులు వ్యవహరిస్తున్నారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Updated Date - 2023-12-01T13:44:09+05:30 IST