Kiran Kumar Reddy: మంచి భాష మాట్లాడే అధ్యక్షురాలు దొరికారు..

ABN , First Publish Date - 2023-07-13T16:35:16+05:30 IST

విజయవాడ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరి పేరు వినగానే చాలా సంతోషించానని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లూరి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

Kiran Kumar Reddy: మంచి భాష మాట్లాడే అధ్యక్షురాలు దొరికారు..

విజయవాడ: బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరి (Purandeshwari) పేరు వినగానే చాలా సంతోషించానని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లూరి కిరణ్ కుమార్ రెడ్డి (Nalluri Kiran Kumar Reddy) అన్నారు. ఈ సందర్భంగా ఆయన గురువారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఒక మంచి భాష మాట్లాడే అధ్యక్షురాలు దొరికారన్నారు. ఇతర పార్టీల నేతల మాదిరి బూతులు తిట్టరని, బీజేపీ సౌత్ ఇండియా (South India)లో బలంగా‌ ఎదుగుతుందని.. త్వరలోనే సౌత్ గేట్ బద్దలు కొట్టబోతున్నామన్నారు. ఏపీలో బీజేపీ బలోపేతానికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. అందరం కలిసి కట్టుగా పనిచేస్తే ఏపీలో బీజేపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని.. ఏ శక్తి ఆపలేదని కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-07-13T16:35:16+05:30 IST