Share News

Keshineni Chinni: టీడీపీ ఆశయాలు కేశినేని ఫౌండేషన్ కొనసాగిస్తోంది..

ABN , First Publish Date - 2023-11-16T15:54:23+05:30 IST

విజయవాడ: నగరంలోని రాణిగారి తోటలో కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం మెడికల్ క్యాంపు నిర్వహించారు. క్యాంపులో టీడీపీ నాయకుడు కేశినేని చిన్ని కళ్ళజోళ్ళు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలకు సేవ చేయడానికి కేశినేని ఫౌండేషన్ ఎపుడు ముందుంటుందన్నారు.

Keshineni Chinni: టీడీపీ ఆశయాలు కేశినేని ఫౌండేషన్ కొనసాగిస్తోంది..

విజయవాడ: నగరంలోని రాణిగారి తోటలో కేశినేని ఫౌండేషన్ (Keshineni Foundation) ఆధ్వర్యంలో గురువారం మెడికల్ క్యాంపు (Medical Camp) నిర్వహించారు. క్యాంపులో టీడీపీ నాయకుడు కేశినేని చిన్ని (Keshineni Chinni) కళ్ళజోళ్ళు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలకు సేవ చేయడానికి కేశినేని ఫౌండేషన్ ఎపుడు ముందుంటుందన్నారు. టీడీపీ (TDP) పార్టీ ఆశయాలు కేశినేని ఫౌండేషన్ కొనసాగిస్తోందని, రాజకీయాల కోసమే సేవా కార్యక్రమాలు చేస్తున్నానని తనపై కొందరు చేసే విమర్శలు పట్టించుకోనని అన్నారు. దుర్మార్గపు జగన్ ప్రభుత్వం పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు మూసివేసిందని మండిపడ్డారు. నేడు కేశినేని ఫౌండేషన్ అన్నా క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి తీరుస్తోందన్నారు. జగన్ ప్రభుత్వ (Jagan Govt.) దుర్మార్గపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, రాజకీయ ఉద్దండుడు, పేదల పక్షపాతి చంద్రబాబు (Chandrababu)పై అక్రమ కేసులు పెట్టి జగన్ ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతోందన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, జనసేన (Janasena) మద్దతుతో టీడీపీ అధికారంలోకి వస్తుందని కేశినేని చిన్ని ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-11-16T15:54:25+05:30 IST