Jawahar: అందుకే జగన్ ముందస్తు ఎన్నికలకు వెనుకడుగు..

ABN , First Publish Date - 2023-06-07T17:07:04+05:30 IST

వైసీపీ పాలనలో దళితులు రెండవ తరగతి పౌరుల్లా బ్రతుకుతున్నారని, మనుషుల ప్రాణాలు తీసే రాక్షసులంతా వైసీపీలోనే ఉన్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జవహర్ అన్నారు.

Jawahar: అందుకే జగన్ ముందస్తు ఎన్నికలకు వెనుకడుగు..

అమరావతి: వైసీపీ పాలన (YCP Rule)లో దళితులు రెండవ తరగతి పౌరుల్లా బ్రతుకుతున్నారని, మనుషుల ప్రాణాలు తీసే రాక్షసులంతా వైసీపీలోనే ఉన్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జవహర్ (Jawahar) అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ముందస్తు ఎన్నికలకు వెళ్తే రాష్ట్ర ప్రజలు వైసీపీ మాడు పగులకొడారన్న భయంతోనే సీఎం జగన్ (CM Jagan) ఎన్నికలకు వెనకడుగు వేస్తున్నారని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీపై ప్రతీకారం తీర్చుకునేందుకు దళితులు సిద్ధంగా ఉన్నారన్నారు.

జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి రాష్ట్రంలో ఏదో మూలన దళితులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అఘాయిత్యాలు నిత్యకృతమయ్యాయని జవహర్ అన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం రావివారిపాలెంలో అంగన్వాడీ టీచర్ హనుమాయమ్మ (Hanumayamma)ను వైసీపీ నేత పట్టపగలే ట్రాక్టర్‌తో తొక్కి చంపటం రాష్ట్రంలోని దళితుల పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. రాక్షస జాతికి తండ్రిలా జగన్ వ్యవహరిస్తూ.. నిందితుల్ని కాపాడుతున్నారని మండిపడ్డారు. జగన్ రెడ్డి అండ చూసుకునే వైసీపీ నేతలు (YCP Leaders), కార్యకర్తలు ప్రజల ప్రాణాలు తీస్తున్నారని, ఘటన జరిగి ఇన్ని రోజులైనా నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదని జవహర్ ప్రశ్నించారు. హనుమాయమ్మను హత్య చేసిన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని జవహర్ డిమాండ్ చేశారు.

Updated Date - 2023-06-07T17:07:04+05:30 IST