Pawan Kalyan: నిజంగా క్లాస్ వార్ చేస్తుంది జగనే...

ABN , First Publish Date - 2023-10-03T11:49:27+05:30 IST

మచిలీపట్నంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి అనేక సమస్యలు వచ్చి చేరాయి.

Pawan Kalyan: నిజంగా క్లాస్ వార్ చేస్తుంది జగనే...

కృష్ణా: మచిలీపట్నంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) దృష్టి అనేక సమస్యలు వచ్చి చేరాయి. జనసేన అధినేతను కలిసిన విద్యుత్ మీటర్ రీడర్లు.. పని భారం పెంచి పొమ్మనకుండా పొగ పెడుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. జగన్ అధికారం‌ కోసం ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చారన్నారు. పాదయాత్రలో నోటికి ఏదొస్తే అది వాగ్ధానం చేశారని.. ఇప్పుడు అమలు చేయకుండా అందరినీ మోసం చేశారని విమర్శించారు. క్లాస్ వార్ అని మాట్లాడే జగన్ అసలు ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. నిజంగా క్లాస్ వార్ చేస్తుంది జగనే అని అన్నారు. పేదలకు అండగా ఉండకుండా మాలటతో మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలకు భారం తప్ప, ప్రయోజనం లేదన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసే బాధ్యతను జనసేన తీసుకుంటుందని తెలిపారు. ‘‘మీకు న్యాయం జరిగేలా నా వంతు కృషి చేస్తా’’ అంటూ పవన్ హామీ ఇచ్చారు.


అనంతరం మచిలీపట్నం హిందూ కళాశాలను పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ పవన్‌కు విద్యార్థి సంఘాలు వినతి చేశారు. హిందూ జాతీయ కళాశాలను దేవాదాయ శాఖకు ఇచ్చినట్లు‌ విద్యార్థి సంఘాలు చెప్పారు. దాతలు కళాశాల‌ కోసం ఇచ్చిన స్థలాన్ని ఎండోమెంట్‌కు ఎలా ఇచ్చారని పవన్ ప్రశ్నించారు. దాతాలు ఏ ఉద్దేశంతో ఇస్తారో వాటికే సద్వినియోగం చేయాలన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఎయిడెడ్ విద్యా సంస్థలు రద్దు చేశారన్నారు. అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం కళాశాల భూములను రియల్ ఎస్టేట్ కోణంలో చూస్తున్నారని మండిపడ్డారు. విద్యకు ప్రాధాన్యత అనేది జగన్ ప్రభుత్వం మాటలకే పరిమితం అయ్యిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-10-03T11:49:27+05:30 IST