AP News: అవనిగడ్డలో హైటెన్షన్

ABN , First Publish Date - 2023-08-29T11:55:21+05:30 IST

జిల్లాలోని అవనిగడ్డలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అవనిగడ్డలో భారీగా పోలీసులు మోహరిస్తున్నారు.

AP News: అవనిగడ్డలో హైటెన్షన్

కృష్ణా: జిల్లాలోని అవనిగడ్డలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అవనిగడ్డలో భారీగా పోలీసులు మోహరిస్తున్నారు. నిన్న (సోమవారం) ఘంటసాల మండలం శ్రీకాకుళం వద్ద ఇసుక క్వారీలలో టీడీపీ సత్యాగ్రహాన్ని ఘంటసాల ఎస్‌ఐ శ్రీనివాస్ అడ్డుకున్నారు. దీంతో ఎస్‌ఐ శ్రీనివాస్ ప్రవర్తనపై మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ (Mandali Buddaprasad) తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఎస్‌ఐ తీరుకు నిరసనగా ఈరోజు ఘంటసాల పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. బుద్ధప్రసాద్ దీక్ష నేపథ్యంలో అవనిగడ్డ, ఘంటసాలలలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఇప్పటికే బుద్ధప్రసాద్ నివాసానికి అవనిగడ్డ సిఐ జి.శ్రీనివాస్, ఎస్‌ఐ రమేష్, పోలీస్ సిబ్బంది చేరుకున్నారు. దీంతో అవనిగడ్డలో ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

Updated Date - 2023-08-29T11:55:21+05:30 IST