Amaravathi: హెచ్‌వోడీలు, అధికారులకు రిమైండర్ మెమో జారీ చేసిన ప్రభుత్వం

ABN , First Publish Date - 2023-02-06T15:07:53+05:30 IST

అమరావతి: ఫేషియల్ అటెండెన్స్‌‌ (Facial Attendance) పై వివిధ శాఖల హెచ్‌వోడీలకు, జిల్లా అధికారులకు ఏపీ ప్రభుత్వం రిమైండర్ మెమో జారీ చేసింది.

Amaravathi: హెచ్‌వోడీలు, అధికారులకు రిమైండర్ మెమో జారీ చేసిన ప్రభుత్వం

అమరావతి: ఫేషియల్ అటెండెన్స్‌‌ (Facial Attendance) పై వివిధ శాఖల హెచ్‌వోడీ (HOD)లకు, జిల్లా అధికారులకు (Officers) ఏపీ ప్రభుత్వం (AP Govt.) రిమైండర్ మెమో (Reminder Memo) జారీ చేసింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ రేవు ముత్యాలరాజు (Muthyala Raju) మాట్లాడుతూ ఫేషియల్ అటెండెన్స్‌ను ఏపీఎఫ్‌ఆర్‌ఎస్ (APFRS) యాప్‌ (App)ను ఉపయోగించి ప్రతీ ఒక్కరూ ఆఫీసుల్లో నమోదు చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని, అయితే నేటికీ చాలా మంది ఫేషియల్ అటెండెన్స్‌‌లో ఎన్‌రోల్ (Enroll) కానట్టు సమాచారం వచ్చిందని చెప్పారు. జనవరి 16వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని 100 శాతం ఎన్‌రోల్‌మెంట్ ఉండాలని చెప్పినా పట్టించుకోవడం లేదంటూ ఆయన మెమోలో అభ్యంతరం తెలిపారు.

ఇకపై 100 శాతం ఎన్‌రోల్‌మెంట్ ఎపీఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌లో నమోదు చేయాలని ముత్యాలరాజు ఆదేశించారు. ఇందు కోసం స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించాలని సూచించారు. ఇకపై ఏపీఎఫ్‌ఆర్‌ఎస్ యాప్ ద్వారానే ముఖాధారిత అటెండెన్స్‌ను నమోదు చేయాలని ఆయన స్పష్టం చేశారు. వివిధ ఆఫీసుల్లో పరిపాలనా అధిపతులు, నోడల్ అఫీసర్‌లు ఈ అటెండెన్స్‌ అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో వారిని బాధ్యులను చేయాల్సి ఉంటుందంటూ రేవు ముత్యాలరాజు మెమోని జారీ చేశారు.

Updated Date - 2023-02-06T15:07:57+05:30 IST