Mandali Buddhaprasad: అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్ హౌస్ అరెస్ట్

ABN , First Publish Date - 2023-08-29T12:53:08+05:30 IST

మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

Mandali Buddhaprasad: అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్ హౌస్ అరెస్ట్

కృష్ణా: మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ను (Mandali Buddhaprasad) పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇసుక అక్రమాలపై పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు బుద్ధప్రసాద్‌ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం ఘంటసాలకు బయలు దేరిన బుద్ధప్రసాద్‌ను పోలీసులు ఇంటి ద్దే నిలిపివేశారు. దీంతో పోలీసులు తీరుపై బుద్ధప్రసాద్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. బుద్ధప్రసాద్ ఇంటివద్ద భారీగా పోలీసులు, తెలుగుదేశం శ్రేణులు మోహరించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జైపీ సంస్థపై కేసు నమోదు చేయాలని బుద్ధప్రసాద్ పట్టుబట్టగా.. అందుకు పోలీసులు నిరాకరించారు. చివరకు హౌస్ అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.


కాగా.. నిన్న (సోమవారం) ఘంటసాల మండలం శ్రీకాకుళం వద్ద ఇసుక క్వారీలలో టీడీపీ సత్యాగ్రహాన్ని ఘంటసాల ఎస్‌ఐ శ్రీనివాస్ అడ్డుకున్నారు. దీంతో ఎస్‌ఐ శ్రీనివాస్ ప్రవర్తనపై బుద్ధప్రసాద్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఎస్‌ఐ తీరుకు నిరసనగా ఈరోజు ఘంటసాల పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. బుద్ధప్రసాద్ దీక్ష నేపథ్యంలో అవనిగడ్డ, ఘంటసాలలలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.

Updated Date - 2023-08-29T12:53:08+05:30 IST