Babu Rajendraprasad: టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్‌కు గుండెపోటు

ABN , First Publish Date - 2023-06-07T10:01:17+05:30 IST

సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్‌ గుండెపోటుకు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన బాబు రాజేంద్రప్రసాద్‌ను కుటుంబసభ్యులు వెంటనే విజయవాడ రమేష్ ఆస్పత్రికి తరలించారు.

Babu Rajendraprasad: టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్‌కు గుండెపోటు

విజయవాడ: సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్‌ (Former MLC Babu Rajendraprasad) గుండెపోటుకు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన బాబు రాజేంద్రప్రసాద్‌ను కుటుంబసభ్యులు వెంటనే విజయవాడ రమేష్ ఆస్పత్రికి తరలించారు. ఆయనకు గుండెపోటు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అయితే వెంటనే చికిత్స చేయగా.. ప్రస్తుతం ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. బాబు రాజేంద్రప్రసాద్‌కు యంజోగ్రామ్ చేసి పూర్తి వివరాలు తెలియజేస్తామని డాక్టర్లు తెలిపారు. బాబు రాజేంద్రప్రసాద్‌ గుండెపోటుకు గురైనట్లు తెలిసిన వెంటనే టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకుంటున్నారు.

Updated Date - 2023-06-07T10:02:42+05:30 IST