Bus Accident: విజయవాడలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి..
ABN , First Publish Date - 2023-11-06T10:16:54+05:30 IST
విజయవాడ: నగరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో 12వ నెంబర్ ఫ్లాట్ ఫాంపైకి బస్సు దూసుకువెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
విజయవాడ: నగరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పండిట్ నెహ్రూ బస్టాండ్ (Pandit Nehru Bus Stand)లో 12వ నెంబర్ ఫ్లాట్ ఫాంపైకి బస్సు దూసుకువెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి (Three Died) చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ (Vijayawada) నుంచి గుంటూరు (Guntur) వెళ్లాల్సిన మెట్రో లగ్జరీ బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో ఫ్లాట్ ఫాంపైకి దూసుకు వెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. మృతుల్లో ఒక మహిళ, 10 నెలల చిన్నారి ఉన్నట్లు సమాచారం. బ్రేక్ ఎందుకు ఫెయిల్ అయిందన్నది ఎవరికీ అర్థం కావడంలేదు. బస్సు డిపో నుంచి బయటకు వచ్చినప్పుడు ఫిట్‌నెస్ పరిశీలించిన తర్వాతే బస్సు కాంప్లెక్స్‌కు తీసుకువస్తారు. అయితే బ్రేక్ ఫెయిల్ కావడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఆర్టీసీ అధికారుల లోపమని స్పష్టమవుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి.. ప్రమాదంపై పరిశీలిస్తున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.