Share News

CM Jagan: దుర్గగుడి అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ శంకుస్ధాపన

ABN , First Publish Date - 2023-12-07T09:54:50+05:30 IST

విజయవాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 216 కోట్ల రూపాయలతో కనక దుర్గగుడి అభివృద్ధి కార్యక్రమాలకు గురువారం ఉదయం శంకుస్ధాపనలు చేశారు.

CM Jagan: దుర్గగుడి అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ శంకుస్ధాపన

విజయవాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 216 కోట్ల రూపాయలతో కనక దుర్గగుడి అభివృద్ధి కార్యక్రమాలకు గురువారం ఉదయం శంకుస్ధాపనలు చేశారు. శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయ పునఃనిర్మాణానికి రూ. 5.60 కోట్లు, ఇంద్రకీలాద్రిపై కొండ రక్షణ చర్యలపనుల నిమిత్తం రూ. 4.25 కోట్లు, ఎల్టీ ప్యానల్ బోర్డులు, ఎనర్జీ వాటర్ మేనేజ్‌మెంట్, స్కాడా ఏర్పాటు నిమిత్తం రూ. 3.25 కోట్లు, 2016 పుష్కరాల సమయంలో కూల్చివేసిన ఆలయాల పునర్నిర్మాణంకు రూ 3.87 కోట్లు, మెగా సోలార్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు రూ. 5.66 కోట్లు, కొండ దిగువున బొడ్డు నిర్మాణం రూ. 0.23 లక్షలు, కొండ దిగువున తొలిమెట్టు వద్ద ఆంజనేయ స్వామి, వినాయక స్వామి వార్ల ఆలయ నిర్మాణం కోసం రూ. 0.265 కోట్లు, అమ్మవారి అన్న ప్రసాద భవన నిర్మాణానికి రూ.30 కోట్లు, అమ్మవారి ప్రసాదం పోటు భవన నిర్మాణం కోసం రూ. 27 కోట్లు, కనకదుర్గ నగర్ నుంచి మహామండపం వరకు ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ. 13 కోట్లు కేటాయించారు.

అలాగే రాజగోపురం ముందు భాగాన మెట్ల నిర్మాణంకు రూ. 15 కోట్లు, మహామండపం వద్ద అదనపు క్యూలైన్ల కోసం రూ. 23.50 కోట్లు, కనక దుర్గ నగర్ వద్ద మహారాజద్వారం నిర్మాణంకు రూ. 7.75 కోట్లు, కనకదుర్గ నగర్ నుంచి మహామండపం వరకు రాజమార్గము అభివృద్ధి నిమిత్తం రూ. 7.50 కోట్లు, కొండపైన పూజా మండపాల నిర్మాణానికి రూ. 7 కోట్లు, మల్లికార్జున మహామండపం క్యూ కాంప్లెక్స్ మార్చుటకు రూ. 18.30 కోట్లు, నూతన కేశఖండనశాల నిర్మాణం నిమిత్తం రూ. 19 కోట్లు, గోశాల అభివృద్ధి నిమిత్తం రూ. 10 కోట్లు, కొండపన యాగశాల కోసం రూ. 5 కోట్లు, కనకదుర్గనగర్‌లో మల్టీ లెవల్ కార్ పార్కింగ్ నిమిత్తం రూ. 33 కోట్లు కేటాయించారు.

కాగా అంతకుముందు ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయానికి విచ్చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డికి మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో కోలాటాల నడుమ మంత్రి కొట్టు సత్యనారాయణ, హోంమంత్రి తానేటి వనిత, మేయర్ భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, చైర్మన్ కర్నాట రాంబాబు ఘన స్వాగతం పలికారు. ఆలయ అధికారులు పూర్ణకుంభతో స్వాగతం పలికారు.

Updated Date - 2023-12-07T09:54:51+05:30 IST