Buddha Venkanna: వైసీపీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు హ్యాపీగా వెళ్లిపోతున్నారు
ABN , Publish Date - Dec 31 , 2023 | 12:36 PM
విజయవాడ: టికెట్స్ లేవంటే వైసీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు హ్యాపీగా వెళ్లిపోతున్నారని తెలుగుదేశం సీనియర్ నేత బుద్దా వెంకన్న అన్నారు. ఈ సందర్బంగా ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ బి.ఫామ్ ఎవరికి ఇచ్చినా ఓడిపోతారని..
విజయవాడ: టికెట్స్ లేవంటే వైసీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు హ్యాపీగా వెళ్లిపోతున్నారని తెలుగుదేశం సీనియర్ నేత బుద్దా వెంకన్న అన్నారు. ఈ సందర్బంగా ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ బి.ఫామ్ ఎవరికి ఇచ్చినా ఓడిపోతారని.. టీడీపీ, జనసేన బి ఫామ్ వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారని జోష్యం చెప్పారు. ఎలాగూ ఓడిపోతారు కాబట్టి.. సీఎం జగన్ నిర్ణయాన్ని వాళ్ళ కార్యకర్తలు అంగీకరిస్తున్నారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో 2024లో తెలుగుదేశం అధికారంలోకి వస్తుందన్నారు.
2023 జగన్మోహన్ రెడ్డి విద్వంస నామ సంవత్సరంగా నామకరణం చేశామని, 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం అంటే కొత్త రాష్ట్రం ఏర్పడినట్టేనని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. 1932లో జనవరి 4న గాంధీ అరెస్ట్ ఎలా గుర్తుందో. అలాగే 2023 సెప్టెంబర్ 9 చంద్రబాబు అరెస్ట్ రాష్ట్రంలో ప్రజలకు గుర్తు ఉంటుందన్నారు. బలహీన వర్గాల పార్టీ టీడీపీ అని, ఉత్తరాంధ్రలో ఒక వెలుగు వెలిగిన బొత్స సత్యనారాయణ ఈ రోజు జగన్ ముందు ఎలా ఉన్నారో చూస్తే బలహీన వర్గాల పరిస్థితి ఎలా వుందో అర్థం అవుతుందన్నారు. మంత్రి బొత్సతో మైకులు లేకుండా మాట్లాడితే ఆయన మొత్తం చెపుతారని బుద్దా వెంకన్న అన్నారు.
నాగుల్ మీరా మాట్లాడుతూ... ఒక నియోజకవర్గంలో పని చేయని వాళ్ళు మరో నియోజకవర్గంలో పని చేస్తారని అనుకోవడం అవివేకమని అన్నారు. అంబేద్కర్ రాజ్యం ఏర్పాటు అవుతుందని.. జగన్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నాశనం చేశారని విమర్శించారు. సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి కాల్ వస్తే ఎమ్మెల్యేలు ఆనందపడుతున్నారని.. టికెట్ ఇస్తే ఒక దండం.. ఇవ్వకపోతే పది దండాలు అంటున్నారన్నారని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు జగన్ తీరని ద్రోహం చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో సైకిల్ గెలుస్తుందని నాగుల్ మీరా ఆశాభావం వ్యక్తం చేశారు.