AP News: సుప్రీం కోర్టులో లిస్ట్ కాని అమరావతి కేసు..

ABN , First Publish Date - 2023-02-06T11:51:27+05:30 IST

ఢిల్లీ: ఏపీ రాజధాని అమరావతి కేసును మెన్షన్ లిస్టులో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు రాసిన లేఖపై ఫలితం కనిపించలేదు.

AP News: సుప్రీం కోర్టులో లిస్ట్ కాని అమరావతి కేసు..

ఢిల్లీ: ఏపీ రాజధాని అమరావతి కేసు (Amaravathi Case)ను మెన్షన్ లిస్టు (Mension List)లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం (AP Govt.) సుప్రీంకోర్టు (Supreme Court) రిజిస్ట్రార్‌కు రాసిన లేఖ (Letter)పై ఫలితం కనిపించలేదు. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు మెన్స

న్ జాబితాలో ఈ కేసు ప్రస్తావన కనిపించలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యూహం ఏంటనే అంశంపై న్యాయవాదుల్లో చర్చ జరుగుతోంది.

ఏపీ రాజధాని అమరావతిపై రాష్ట్ర హైకోర్టు (High Court) త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం దాకలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సత్వరమే విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు లేఖ రాసింది. ఇవాల్టి మెన్షన్ జాబితాలో దీన్ని చేర్చాలని అభ్యర్థించింది. ఆదివారం సాయంత్రం వరకూ సుప్రీం కోర్టులో సోమవారం మెన్షన్ జాబితాలో చేర్చాల్సిన అంశాలలో ఈ కేసు లేదని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆ తర్వాత ఏమైనా మెన్షన్ జాబితాలోకి వస్తుందేమోనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

సోమవారం ఒకవేళ మెన్షన్ చేసినా కూడా విచారణకు తేదీ ఇచ్చే అవకాశముందని న్యాయవాదులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదని రాష్ట్ర హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తన తీర్పులో చెప్పడం ద్వారా ప్రభుత్వ అధికారాల్లో కోర్టు జోక్యం చేసుకోదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. దీనిపై సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. పైగా రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ ఒప్పందం కింద 33వేల ఎకరాలు ఇచ్చిన రైతులతో సీఆర్డీయే రద్దు పరచడానికి వీలులేని ఒప్పందం చేసుకున్న తర్వాత మళ్లీ ఆ అంశంపై ప్రభుత్వం వెనక్కి ఎళా వెళుతుందని హైకోర్టు ప్రశ్నించింది.

Updated Date - 2023-02-06T11:51:31+05:30 IST