Share News

AP NEWS: నూజివీడులో పేకాటరాయుళ్ల కొత్త టెక్నీక్

ABN , Publish Date - Dec 18 , 2023 | 12:12 AM

నూజివీడులో పేకాటరాయుళ్ల కొత్త టెక్నీక్‌కి తెరదీశారు. ఏలూరు జిల్లా నూజివీడు ప్రాంతంలో మామిడి తోటలను గతంలో పేకాటస్థావరాలకు అనువుగా మార్చుకుని పేకాటరాయుళ్లు రెచ్చిపోయారు.

AP NEWS: నూజివీడులో పేకాటరాయుళ్ల కొత్త టెక్నీక్

నూజివీడు: నూజివీడులో పేకాటరాయుళ్ల కొత్త టెక్నీక్‌కి తెరదీశారు. ఏలూరు జిల్లా నూజివీడు ప్రాంతంలో మామిడి తోటలను గతంలో పేకాటస్థావరాలకు అనువుగా మార్చుకుని పేకాటరాయుళ్లు రెచ్చిపోయారు. జిల్లా ఎస్పీ, ఎస్ఈబీ స్పెషల్ టీమ్ అధికారుల వరుస దాడులతో భయపడిపోయి నూజివీడు ప్రాంతంలో దుకాణం మూసివేసి, సరిహద్దు తెలంగాణ ఏరియాకు ఆటగాళ్లు రూటుమార్చారు. కొన్ని రోజుల క్రితం నూజివీడు ఏరియాలో హోటళ్లు, లాడ్జీలు, త్రిబుల్ బెడ్ రూమ్ అపార్ట్‌మెంట్స్‌ను అనువుగా చేసుకొని కేటుగాళ్లు మూడుముక్కలాటలకు తెరలేపారు. పొరుగు ప్రాంతాల నుంచి వస్తున్న బడాబాబుల కార్లతో గ పట్టణ శివారులోని నిర్మానుష్య ప్రాంతంలోని కొన్ని భవంతులు కేటుగాళ్లతో నిండిపోయాయి. నూజివీడు పోలీసులకు పేకాట బాబులు సవాల్ విసురుతూ పెట్రేగిపోతున్నారు. వీరి ఆటలపై పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - Dec 18 , 2023 | 12:12 AM