Share News

Kollu Ravindra : బందరు కోట గుడిలో పూజలు చేసేందుకు కొల్లు రవీంద్ర వెళ్లగా..

ABN , First Publish Date - 2023-10-16T13:35:36+05:30 IST

మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ కొల్లు రవీంద్ర సైకిల్ యాత్ర చేపట్టారు.

Kollu Ravindra : బందరు కోట గుడిలో పూజలు చేసేందుకు కొల్లు రవీంద్ర వెళ్లగా..

విజయవాడ : మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ కొల్లు రవీంద్ర సైకిల్ యాత్ర చేపట్టారు. బందరు కోట గుడిలో పూజలు చేసేందుకు వచ్చిన రవీంద్రను పోలీసులు అడ్డుకున్నారు. సైకిల్ యాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేస్తున్నారని కొల్లు రవీంద్ర అన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని వాపోయారు.

Updated Date - 2023-10-16T13:35:36+05:30 IST