Vizag Steel Plant : విశాఖ స్టీల్‌ప్లాంట్ EOI బిడ్‌లో కీలక అప్డేట్.. ఇంత హడావుడి చేసిన తెలంగాణ చివరికి..

ABN , First Publish Date - 2023-04-15T17:23:08+05:30 IST

వైజాగ్ స్టీల్‌ప్లాంట్ (Vizag Steel Plant) బిడ్ల వ్యవహారం (Bidding Process) గురించి తెలుగు రాష్ట్రాలతో (Telugu States) పాటు దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది...

Vizag Steel Plant : విశాఖ స్టీల్‌ప్లాంట్ EOI  బిడ్‌లో కీలక అప్డేట్.. ఇంత హడావుడి చేసిన తెలంగాణ చివరికి..

వైజాగ్ స్టీల్‌ప్లాంట్ (Vizag Steel Plant) బిడ్ల వ్యవహారం (Bidding Process) గురించి తెలుగు రాష్ట్రాలతో (Telugu States) పాటు దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. స్టీల్‌ప్లాంట్‌ను పూర్తిస్ధాయిలో సజావుగా నడిపించేందుకు వీలుగా అవసరమైన మూలధనం సేకరించేందుకు వీలుగా యాజమాన్యం బిడ్లపై ఆసక్తి వ్యక్తీకరణ కోరింది. దీంతో మొదట ఈవోఐ బిడ్ల సమర్పణకు ఏప్రిల్- 15 మధ్యాహ్నం 3 గంటల వరకు గడువుగా నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ సుమారు 22 కంపెనీలు బిడ్‌లు దాఖలు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందులో పలు బడా కంపెనీలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే బిడ్‌లకు మరో ఐదురోజులు గడువు పెంచడం జరిగింది. ఈనెల 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు పెంచినట్లు రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (RNL) ఓ ప్రకటనలో తెలిపింది. మరిన్ని కంపెనీలు బిడ్‌లో పాల్గొంటాయనే సమాచారంతో గడువు పెంచినట్లు తెలుస్తోంది.

Vizag-Steel-Plant.jpg

తెలంగాణ నుంచి ఏమీ లేదేం..!

ఇవాళ జరిగిన ఈవోఐ బిడ్‌లో తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) పాల్గొనలేదు. దీంతో ఇన్నిరోజులు తెలంగాణ సర్కార్ తరఫున బిడ్ వేస్తామని మంత్రులు మాట్లాడిన మాటలన్నీ ప్రకటనలకే పరిమితం అయ్యాయనే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇంతవరకూ బిడ్‌లో పాల్గొనడంపై తెలంగాణ అధికారులు ఎక్కడా నిర్ధారించలేదు. అయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కాలరీస్ కు చెందిన అధికారుల్ని అక్కడికి పంపి పరిశీలించిన తర్వాత ఓ నివేదికను సీఎం కేసీఆర్‌కు (CM KCR) అందజేసిన తర్వాత కూడా మిన్నకుండిపోవడం గమనార్హం. అయితే తదుపరి EOI బిడ్‌లో అయినా తెలంగాణ పాల్గొంటుందో లేదో చూడాలి.

EX-JD-Laxmi-Narayana.jpg

బిడ్డలాగా చూసుకోవాలనే..!

మరోవైపు.. ప్రజల తరఫున బిడ్ వేస్తానంటూ ముందుకొచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (VV Lakshmi Narayana) అన్నట్లుగానే బిడ్ దాఖలు చేశారు. క్రౌండ్ ఫండింగ్ నిధులు సేకరిస్తామని లక్ష్మీ నారాయణ ప్రకటించారు. ఇందులో ఏం చేయలగమో అనేది ఆలోచిస్తామని.. స్టీల్‌ప్లాంట్‌ను బిడ్డలాగా చూసుకోవాలనే బిడ్ వేసినట్లు తెలిపారు. అయితే.. ప్రభుత్వం క్లీన్ షేవ్ చేయాలనకుంటోందని.. తాము మాత్రం క్లియర్ సేవ్ చేయాలని ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వరంగ సంస్థగా ఉండాలనేది తమ కోరిక అని లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు.

*****************************

ఇవి కూడా చదవండి..

*****************************

Sukesh Vs Kavitha : కవితపై మరో సంచలన లేఖ రిలీజ్ చేసిన సుకేష్.. ఈసారి మొత్తం అన్నీ...

*****************************

TS Congress : తెలంగాణ కాంగ్రెస్ వెనుకపడిందేం.. అందరూ కమలం వైపు చూస్తున్నారేంటి.. రేపో మాపో..!?

*****************************

AP Politics : ప్చ్.. వైఎస్‌ జగన్‌లో మునుపటి కళ ఏమైందో.. ఈ పరిణామాలే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా.. మళ్లీ ఆ రోజులు ఎప్పుడొస్తాయో..!?

*****************************

YSRCP : అప్పట్లో స్టేజ్‌పై రజిని ఏడవటం.. ఇప్పుడు ముఖ్య నేతల భేటీకి సంబంధమేంటి.. ఎక్కడో తేడా కొడుతోందే..!?

*****************************

Rajini Emotional : బాబోయ్.. నిండు సభలో జగన్ గురించి మాట్లాడుతూ విడదల రజిని కంటతడి.. నాడు అలా.. నేడు ఇలా.. సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియోలు..

*****************************

Updated Date - 2023-04-15T17:41:40+05:30 IST