BJP Leaders: సర్వరాయసాగర్ ప్రాజెక్ట్‌ను సందర్శించిన బీజేపీ నేతలు
ABN , First Publish Date - 2023-11-29T16:13:45+05:30 IST
Andhrapradesh: జిల్లాలోని విన్‌పల్లె మండలంలో ఉన్న సర్వరాయసాగర్ ప్రాజెక్టును బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, పార్టీ నేతలు బుధవారం సందర్శించారు.
కడప: జిల్లాలోని విన్‌పల్లె మండలంలో ఉన్న సర్వరాయసాగర్ ప్రాజెక్టును బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, పార్టీ నేతలు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ.. రాయలసీమతో పాటు సొంత జిల్లా అభివృద్దిని, రైతులను సీఎం జగన్ రెడ్డి గాలికి వదిలేశారని విమర్శించారు. సర్వరాయసాగర్ ప్రాజెక్టులో ఉన్న నీటిని తన భారతి సిమెంటు ఫ్యాక్టరీకి, తన మేనమామ స్థానిక ఎమ్మెల్యే చేపల చెరువులకు ఉపయోగించుకుంటున్నారన్నారు.
గండికోట, సర్వరాయసాగర్ ప్రాజెక్టుల పరిధిలో పంటకాలువల గురించి జగన్ రెడ్డి పట్టించుకోలేదన్నారు. ప్రాజెక్టుల్లో నీటిని రైతులకు ఉపయోగ పడే విధంగా కాకుండా జగన్ రెడ్డి ఆయన బంధువుల అవసరాల కోసం నీటిని ఉపయోగించుకోవడం దారుణమన్నారు. 45 ఏళ్లుగా వైఎస్ కుటుంబాన్ని కడప జిల్లా ప్రజలు మోస్తూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ముఖ్యమంత్రులను చేశారన్నారు. అలాంటి సొంతజిల్లా ప్రజలకు, రైతులకు జగన్ రెడ్డి ద్రోహం చేయడం దారుణమని సత్యకుమార్ విరుచుకుపడ్డారు.