Viveka Murder Case: అవినాష్ ముందోస్తు బెయిల్‌పై నేడు విచారణ

ABN , First Publish Date - 2023-05-27T08:18:28+05:30 IST

హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందోస్తు బెయిల్‌పై శనివారం విచారణ జరగనుంది. కాగా ఇప్పటికే అనాష్, సునీత తరుపు వాదనలు ముగిసాయి.

Viveka Murder Case: అవినాష్ ముందోస్తు బెయిల్‌పై నేడు విచారణ

హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందోస్తు బెయిల్‌పై శనివారం విచారణ జరగనుంది. కాగా ఇప్పటికే అనాష్, సునీత తరుపు వాదనలు ముగిసాయి. తెలంగాణ హైకోర్టులో నిన్న సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఇవాళ ఉదయం 10.30 గంటలకు సీబీఐ వాదనలు మొదలు కానున్నాయి.

కాగా వివేకా కేసులో మొదటిసారిగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేరు వచ్చింది. వివేకా మృతి వార్త బాహ్య ప్రపంచానికి తెలియక ముందే జగన్‌కు తెలిసినట్లు సీబీఐ చెబుతోంది. ఆ రోజు ఉదయం 6.15 గంలకు బయట ప్రపంచానికి వివేకా మరణ వార్త తెలిస్తే.. జగన్‌కు 6.15కు ముందే తెలిసినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని అవినాష్ రెడ్డి ద్వారానే సీఎం జగన్ తెలుసుకున్నారా? అనేది తెలియాల్సి ఉందని సీబీఐ అధికారులు అంటున్నారు.

కాగా నిన్న అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది ఉమామహేశ్వర రావు ఐదున్నర గంటల పాటు వాదనలు వినిపించారు. సునీత తరపు న్యాయవాది వాదనలు కూడా ముగిశాయి. సునీత తరపు న్యాయవాది సుమారు గంటసేపు వాదనలు వినిపించారు. దీంతో కోర్టు సమయం ముగియడంతో తదుపరి విచారణను శనివారం నాటికి వాయిదా వేసింది. ఈరోజు ఉదయం 10.30 గంటలకు సీబీఐ వాదనలు వింటామని హైకోర్టు పేర్కొంది.

Updated Date - 2023-05-27T08:18:28+05:30 IST