RBI: జగన్ సర్కారుకు మరో రూ.2 వేల కోట్ల అప్పు.. ఆర్‌బీఐకి ఏపీ ఇండెంట్

ABN , First Publish Date - 2023-06-23T20:08:52+05:30 IST

వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సర్కారు (Jagan government) మరో రూ.2 వేల కోట్ల అప్పు తెస్తోంది.

RBI: జగన్ సర్కారుకు మరో రూ.2 వేల కోట్ల అప్పు.. ఆర్‌బీఐకి ఏపీ ఇండెంట్

అమరావతి: వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సర్కారు (Jagan government) మరో రూ.2 వేల కోట్ల అప్పు తెస్తోంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్‌కు (RBI) ఏపీ సర్కారు ఇండెంట్ పెట్టింది. రూ.500 కోట్లు 16 ఏళ్లకు, మరో రూ.500 కోట్లు 18 ఏళ్లకు ఇండెంట్ పెట్టింది. మరో వెయ్యి కోట్లు 20 ఏళ్లకు వేలానికి ఏపీ ఇండెంట్ పెట్టింది. ఈ రూ.2 వేల కోట్లతో FRBMలో మొత్తం రూ.22,500 కోట్ల అప్పు చేసింది. FRBMలో ఇక మిగిలింది రూ.8 వేల కోట్లు మాత్రమే.

ఈ నెల 6న ఏపీ ప్రభుత్వం మరో 3 వేల కోట్ల అప్పు తీసుకుంది. వెయ్యి కోట్లు 14 సంవత్సరాలకు 7.36 శాతం వడ్డీతో, మరో వెయ్యి కోట్లు 20 సంవత్సరాలకు 7.33 శాతం వడ్డీతో రుణం పొందింది. రూ. 500 కోట్లు 10 సంవత్సరాలకు 7.33 శాతం, మరో రూ. 500 కోట్లు 19 సంవత్సరాలకు 7.33 శాతం వడ్డీతో రుణం తీసుకుంది. కేవలం 65 రోజులు వ్యవధిలో 18 వేల 500 కోట్లను ఏపీ ప్రభుత్వం అప్పుగా తీసుకొచ్చింది.

Updated Date - 2023-06-23T20:10:55+05:30 IST