Balakrishna: 16 నెలలు జైల్లో ఉన్నారు.. 16 నిమిషాలైనా బాబును జైల్లో పెట్టాలనేదే జగన్ జీవిత లక్ష్యం

ABN , First Publish Date - 2023-09-09T10:12:10+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్రంగా ఖండించారు. జగన్ పాలకుడు కాదు కక్ష్యదారుడని విరుచుకుపడ్డారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ దుర్మార్గమన్నారు. జగన్ సీఎం అయ్యాక అన్నం తినటం మానేసి కోర్టుల చేత చివాట్లు తింటున్నారని యెద్దేవా చేశారు.

Balakrishna: 16 నెలలు జైల్లో ఉన్నారు.. 16 నిమిషాలైనా బాబును జైల్లో  పెట్టాలనేదే జగన్ జీవిత లక్ష్యం

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) అరెస్ట్‌ను హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Hindupuram MLA Nandamuri Balakrishna) తీవ్రంగా ఖండించారు. జగన్ (CM Jagan) పాలకుడు కాదు కక్ష్యదారుడని విరుచుకుపడ్డారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ దుర్మార్గమన్నారు. జగన్ సీఎం అయ్యాక అన్నం తినటం మానేసి కోర్టుల చేత చివాట్లు తింటున్నారని యెద్దేవా చేశారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి ప్రతిపక్షనేతలపై కక్ష్యసాధింపులకు పాల్పడే ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్బాగ్యమన్నారు. ‘‘నేను 16 నెలలు జైల్లో ఉన్నాను, చంద్రబాబు నాయుడుని 16 నిమిషాలైన జైల్లో పెట్టాలన్నదే తన జీవిత లక్ష్యమన్నట్టు జగన్ కక్ష్యసాధిస్తున్నారు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడిని ఏ చట్టం ప్రకారం అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. స్కిల్‌డెవలప్‌మెంట్ పెద్ద కుంభకోణమని ప్రచారం తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఇది కావాలని రాజకీయ కక్ష్యతో చేస్తున్న కుట్రన్నారు. 2021 డిసెంబర్ 19లో ఎఫ్‌ఐఆర్ నమోదైందని, నిజంగా అవినీతి జరిగి ఉంటే ఇంతవరకు ఎందుకు చార్జ్‌షీట్ చేయలేదని బాలయ్య నిలదీశారు.


డిజైన్ టెక్ సంస్ధ అకౌంట్‌లు ఫ్రీజ్ చేసి నిధులు స్తంభింబచేసినప్పుడు కోర్టు జగన్‌కు చివాట్లు పెట్టి ఆ డబ్బు నేరానికి సంబంధించింది కాదని ఆదేశాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని అడిగారు. 2.13 లక్షల విద్యార్దులకు శిక్షణ ఇచ్చి 72 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారని, దీనిని కుంభకోణం అని ఏ విధంగా అంటారని స్వయంగా హైకోర్టు చెప్పలేదా అని మండిపడ్డారు. మళ్లీ తప్పుల మీద తప్పుల చేసి కోర్టుల చేత ఎందుకు తిట్లు తింటారన్నారు. ఎలాంటి అవినీతి లేని కేసులో రాజకీయ కుట్రతోనే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అక్రమ అరెస్టులకు భయపడేది లేదని.. దీనిపై న్యాయపోరాటం చేస్తామని.. ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటామని బాలకృ‌ష్ణ స్పష్టం చేశారు.

Updated Date - 2023-09-09T10:52:56+05:30 IST