Heavy rain: విస్తారంగా వర్షాలు

ABN , First Publish Date - 2023-05-04T21:45:37+05:30 IST

తమిళనాడు (Tamil Nadu) తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తేమగాలులు వీస్తుండడంతో గురువారం రాయలసీమ

Heavy rain: విస్తారంగా వర్షాలు

విశాఖపట్నం: తమిళనాడు (Tamil Nadu) తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తేమగాలులు వీస్తుండడంతో గురువారం రాయలసీమ, కోస్తాల్లో అనేకచోట్ల వర్షాలు కురిశాయి. అక్కడక్కడా ఈదురుగాలులతో భారీవర్షాలు (Heavy rain) కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. రెండు, మూడు రోజుల్లో వర్షాలు క్రమేపీ తగ్గుతాయని పేర్కొంది. గురువారం రాష్ట్రంలో పలుచోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. కావలిలో 36.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

Updated Date - 2023-05-04T21:45:37+05:30 IST