AP news: హెలీకాప్టర్ ద్వారా గుండె తరలింపు

ABN , First Publish Date - 2023-09-26T20:56:44+05:30 IST

ప్రాణాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా హెలికాప్టర్ ద్వారా గుండెను తరలించిన ఆసక్తికర ఘటన జరిగింది. గుండెను గుంటూరు నుంచి తిరుపతికి తరలించారు. విజయవంతంగా శస్త్రచికిత్స చేసి ఒక‌ వ్యక్తి ప్రాణాన్ని వైద్యులు నిలిపారు. పద్మావతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ శస్త్ర చికిత్స జరిగింది.

AP news: హెలీకాప్టర్ ద్వారా గుండె తరలింపు

తిరుపతి: ప్రాణాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా హెలికాప్టర్ ద్వారా గుండెను తరలించిన ఆసక్తికర ఘటన జరిగింది. గుండెను గుంటూరు నుంచి తిరుపతికి తరలించారు. విజయవంతంగా శస్త్రచికిత్స చేసి ఒక‌ వ్యక్తి ప్రాణాన్ని వైద్యులు నిలిపారు. పద్మావతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ శస్త్ర చికిత్స జరిగింది. గుంటూరులో ప్రమాదవశాత్తూ 18 ఏళ్ల కట్టా కృష్ణ బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అతని అవయవాలు దానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపారు. దీంతో తిరుపతికి చెందిన 33 ఏళ్ల వ్యక్తిని బతికించేందుకు హెలికాప్టర్‌లో గుండెని వైద్యులు తరలించారు.

Updated Date - 2023-09-26T20:56:44+05:30 IST