Share News

Shariff: ఈ నెల 25 ,26 తేదీలల్లో మైనార్టీల వర్క్ షాప్

ABN , First Publish Date - 2023-11-21T15:22:39+05:30 IST

మైనార్టీలను తెలుగుదేశం పార్టీకి మరింత దగ్గరగా చేసేందుకు ఈనెల 25 ,26 తేదీలల్లో ఎనిమిది జిల్లాల్లో మైనార్టీల వర్క్ షాప్ ఏర్పాటు చేస్తున్నట్లు శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ ( Shariff ) ప్రకటించారు.

Shariff:  ఈ నెల 25 ,26 తేదీలల్లో మైనార్టీల వర్క్ షాప్

అమరావతి: మైనార్టీలను తెలుగుదేశం పార్టీకి మరింత దగ్గరగా చేసేందుకు ఈనెల 25 ,26 తేదీలల్లో ఎనిమిది జిల్లాల్లో మైనార్టీల వర్క్ షాప్ ఏర్పాటు చేస్తున్నట్లు శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ ( Shariff ) ప్రకటించారు. మంగళవారం నాడు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో సమావేశమైన టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ...‘‘మైనార్టీలను టీడీపీ మరింత దగ్గరగా చేసేందుకు ఈనెల 25 ,26 తేదీలల్లో ఎనిమిది జిల్లాల్లో మైనార్టీల వర్క్ షాప్ ఏర్పాటు చేస్తున్నాం. డిసెంబర్ రెండో తేదీ నుంచి 20 రోజుల పాటు 46 నియోజవర్గాలల్లో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో మైనార్టీలు 50 నియోజకవర్గాలల్లో 20% వరకు ఉన్నారు. గతంలో టీడీపీ ముస్లిం మైనార్టీలకు ఏ విధంగా రక్షణ కల్పించిందని అనే విషయాన్ని ముస్లిం వర్గాలల్లోకి తీసుకువెళ్తాం. వైసీపీ ప్రభుత్వం మైనార్టీ ఓట్లు దండుకుని ఏ విధంగా వారిని మోసం చేసింది.. మైనార్టీలపై దాడులకు తెగబడింది అనేది క్షేత్రస్థాయిలో వివరిస్తాం. మైనార్టీలకు బడ్జెట్‌లో డబ్బులు కేటాయించి వాటిని నవరత్నాలకు మళ్లించింది. గడిచిన నాలుగల్లో వంద మందికి పైగా మైనార్టీలపై దాడులకు వైసీపీ నేతలు పాల్పడ్డారు. మైనార్టీల మీద దాడులు చేయటమే కాకుండా వారిని హత్యలు కూడా చేశారు’’ అని షరీఫ్ పేర్కొన్నారు.

Updated Date - 2023-11-21T15:22:43+05:30 IST