Road Accident : పల్నాడు జిల్లా వినుకొండ సమీపంలో రోడ్డు ప్రమాదం..

ABN , First Publish Date - 2023-10-02T08:42:19+05:30 IST

పల్నాడు జిల్లాలోని వినుకొండ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పసుపులేరు వాగు వంతెన వద్ద కారు- లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన ఆ ముగ్గురు యువకులే...

Road Accident : పల్నాడు జిల్లా వినుకొండ సమీపంలో రోడ్డు ప్రమాదం..

పల్నాడు జిల్లాలోని వినుకొండ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పసుపులేరు వాగు వంతెన వద్ద కారు- లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన ఆ ముగ్గురు యువకులే. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించిన స్థానికులు చికిత్స అందిస్తున్నారు. కాగా.. మృతుల్లో శావల్యాపురం మండలం ముండ్రువారిపాలెంకు చెందిన నవీన్, కనుమరలపూడి కి చెందిన యెహోషువ, వినుకొండకు చెందిన శివారెడ్డి ఉన్నారు. మృతదేహాలను వినుకొండ ప్రభుత్వాసుపత్రికి పోలీసులు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-10-02T08:42:32+05:30 IST