AP assembly: కీలక బిల్లుల ఆమోదం

ABN , First Publish Date - 2023-09-25T15:06:39+05:30 IST

ఏపీ అసెంబ్లీ(AP Assembly) నేడు కీలక బిల్లులను అమోదించింది. ఏపీ ప్రభుత్వం(AP Govt) ప్రవేశపెట్టిన 10బిల్లులను అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

AP assembly: కీలక బిల్లుల ఆమోదం

అమరావతి: ఏపీ అసెంబ్లీ(AP Assembly) నేడు కీలక బిల్లులను అమోదించింది. ఏపీ ప్రభుత్వం(AP Govt) ప్రవేశపెట్టిన 10బిల్లులను అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అసైన్డ్ ల్యాండ్స్-భూముల రీసర్వేపై స్వల్పకాలిక చర్చ జరుగుతోంది. ఏపీపీఎస్సీ చట్ట సవరణ బిల్లు, ఏపీజీఎస్టీ సవరణ బిల్లు, ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం చేసే చట్ట సవరణ బిల్లు, ఏపీ మోటార్ వెహికల్స్ ట్యాక్సెస్ సవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది. ఏపీ రవాణా వాహనాల పన్నుల చట్టంలో రెండో సవరణ బిల్లు, ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ సవరణ బిల్లు, ఏపీ భూదాన్, గ్రామదాన్ సవరణ బిల్లు, హిందూ ధార్మిక చట్టం సవరణ బిల్లు, ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీల సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

Updated Date - 2023-09-25T15:06:39+05:30 IST