Minister Rajini: క్యాన్సర్ రోగులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన చికిత్స..

ABN , First Publish Date - 2023-06-30T15:14:39+05:30 IST

గుంటూరు జిల్లా: క్యాన్సర్ రోగులకు ప్రభుత్వ వైద్య పథకాల ద్వారా తక్కువ ఖర్చుతో చికిత్స అందించటంపై నేషనల్ క్యాన్సర్ గ్రిడ్-ఏపీ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం గుంటూరు జీజీహెచ్‌లో సదస్సు నిర్వహించారు.

Minister Rajini: క్యాన్సర్ రోగులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన చికిత్స..

గుంటూరు జిల్లా: క్యాన్సర్ (Cancer) రోగులకు ప్రభుత్వ వైద్య పథకాల ద్వారా తక్కువ ఖర్చుతో చికిత్స అందించటంపై నేషనల్ క్యాన్సర్ గ్రిడ్-ఏపీ శాఖ (National Cancer Grid- AP Deptt) ఆధ్వర్యంలో శుక్రవారం గుంటూరు జీజీహెచ్‌ (GGH)లో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని (Minister Vidadala Rajini) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మారిన జీవనశైలితో ప్రతి ఆరుగిరిలో ఒకరు క్యాన్సర్ భారిన పడుతున్నారని, క్యాన్సర్ రోగులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన చికిత్స అందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

రాష్ట్రంలో గత నాలుగేళ్లలో 8.23లక్షల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయని, 2.8లక్షల మందికి ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించామని మంత్రి విడదల రజిని చెప్పారు. క్యాన్సర్ చికిత్స కోసం నాలుగేళ్లలో రూ.17 వందల కోట్లకు పైగా వ్యయం చేశామన్నారు. ప్రభుత్వ వైద్యకళాశాలల్లో క్యాన్సర్ చికిత్సలను అందుబాటులోకి తెస్తున్నామని, సింగపూర్ వంటి దేశంలో అత్యధికమంది కేన్సర్‌తో చనిపోతున్నారని అన్నారు. ప్రజలు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేసుకోవాలని, క్యాన్సర్ చికిత్స కంటే నివారణ మేలన్న విషయం గుర్తించాలని మంత్రి విడదల రజిని అన్నారు.

Updated Date - 2023-06-30T15:14:39+05:30 IST