AP Assembly: కుల‌గ‌ణ‌న‌పై అసెంబ్లీలో మంత్రి వేణుగోపాల్ ప్రకటన

ABN , First Publish Date - 2023-09-26T15:00:43+05:30 IST

కుల‌గ‌ణ‌న‌పై అసెంబ్లీలో మంత్రి వేణుగోపాల్ (venugopala krishna) ప్రకటన చేశారు. అసెంబ్లీలో మంత్రి మాట్లాడారు. ఆర్థిక అస‌మాన‌త‌లు తొల‌గించేందుకు జ‌న‌గ‌ణ‌న‌తో పాటు కుల‌గ‌ణ‌న కూడా చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఉందని వేణుగోపాల్ తెలిపారు.

AP Assembly: కుల‌గ‌ణ‌న‌పై అసెంబ్లీలో మంత్రి వేణుగోపాల్ ప్రకటన

అమ‌రావ‌తి: కుల‌గ‌ణ‌న‌పై అసెంబ్లీలో మంత్రి వేణుగోపాల్ (venugopala krishna) ప్రకటన చేశారు. అసెంబ్లీలో మంత్రి మాట్లాడారు. ఆర్థిక అస‌మాన‌త‌లు తొల‌గించేందుకు జ‌న‌గ‌ణ‌న‌తో పాటు కుల‌గ‌ణ‌న కూడా చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఉందని వేణుగోపాల్ తెలిపారు. పూర్తి స్థాయిలో కుల‌గ‌ణ‌న చేప‌ట్టి 92 సంవత్సరాలు అయిందని పేర్కొన్నారు. సామాజిక‌, ఆర్థిక, విద్యా పురోభివృద్ధి కోసం కుల‌గ‌ణ‌న చేయాల్సి ఉందన్నారు. స‌మ‌స‌మాజ స్థాప‌న‌కు కుల‌గ‌ణ‌న అవ‌స‌రం ఉందని వెల్లడించారు. స‌చివాల‌య‌, వాలంటీర్ వ్యవస్థ ద్వారా కుల‌గ‌ణ‌న చేప‌ట్టాల‌ని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. రాష్ట్రంలో కుల‌గ‌ణ‌న చేయ‌డానికి ఆరుగురు సీనియ‌ర్ అధికారుల‌ను నియ‌మించిందని.. కుల‌గ‌ణ‌న అధ్యయన క‌మిటీ సిఫార్సుల ఆధారంగా కుల‌గ‌ణ‌న‌పై నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

Updated Date - 2023-09-26T15:00:43+05:30 IST